Assembly Elections results: బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో సంబరాలు... హాజరవుతున్న మోదీ
ABN, First Publish Date - 2023-12-03T13:22:21+05:30
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకునే దిశగా ఫలితాలు వెలువడుతుంటడం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో సైతం మెజారిటీ మార్క్ దాటడం, తెలంగాణలోనూ తొలిసారి రెండంకెల స్థాయికి చేరువతుండటంతో పార్టీలో సంబరాలు మొదలవుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాత్రి 7 గంటలకు జరిగే విజయోత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ (Madhya pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) తిరిగి అధికారం నిలబెట్టుకునే దిశగా ఫలితాలు వెలువడుతుంటడం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో సైతం మెజారిటీ మార్క్ దాటడం, తెలంగాణలోనూ తొలిసారి రెండంకెల స్థాయికి చేరువతుండటంతో పార్టీలో సంబరాలు మొదలవుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాత్రి 7 గంటలకు జరిగే విజయోత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం కౌటింగ్ జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ విస్తృత ప్రచారం సాగించడం, అందుకు తగినట్టుగా ఫలితాలు వెలువడుతున్న కొద్దీ మోదీ మ్యాజిక్‌పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
సంబరాలు..
కాగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ మెజారిటీకి అవసరమైన 'హాఫ్ మార్క్'ను దాటినట్టు ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టేశారు. జైపూర్‌లో పార్టీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున మహిళా కార్యకర్తలు మోదీ నినాదాలతో హోరెత్తించారు. స్టార్ క్యాంపెయినర్‌గా మోదీ నాలుగు రాష్ర్రాల్లో జరిపిన విస్తృత ప్రచారం, రోడ్‌షోలు పార్టీ విజయానికి దోహదపడ్డాయని పలువురు కార్యకర్తలు వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మిజోరంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ డిసెంబర్ 4వ తేదీకి కౌంటింగ్‌ను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది.
Updated Date - 2023-12-03T13:40:41+05:30 IST