ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA: ఆయన్ను పదవి నుంచి తొలగించాల్సిందే!

ABN, First Publish Date - 2023-11-28T08:42:41+05:30

టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి నుంచి కేఎస్‌ అళగిరిని ఇక ఏ మాత్రం జాప్యం వహించకుండా పార్టీ అధిష్ఠానం తొలగించాలని ఈరోడ్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు

- సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి నుంచి కేఎస్‌ అళగిరిని ఇక ఏ మాత్రం జాప్యం వహించకుండా పార్టీ అధిష్ఠానం తొలగించాలని ఈరోడ్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(EVKS Ilangovan) డిమాండ్‌ చేశారు. ఐదేళ్లపాటు పదవిలో కొనసాగిన అళగిరి మునుపటిలా ఉత్సాహంగా పనిచేయలేక పోతున్నారని, కీలకమైన సమావేశాలకు సీనియర్‌ నేతలను ఆహ్వానించడం లేదన్నారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌... ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శిస్తున్నారని, ఇదే తరహాలో అళగిరి విమర్శనాస్త్రాలు సంధించ లేకపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)... కాంగ్రెస్‏ను తీవ్రంగా విమర్శిస్తూ చేస్తున్న ఆరోపణలను కూడా అళగిరి ఖండించలేక మౌనం పాటిస్తున్నారని తెలిపారు. అళగిరిని పదవి నుండి తొలగించాలని పలుమార్లు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల తాను కూడా ఢిల్లీ వెళ్లి కొత్త వ్యక్తికి టీఎన్‌సీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలని కోరారని, త్వరలో మారుస్తాం అటూ అధిష్ఠానం హామీ ఇస్తోందే తప్ప తరువాత పట్టించుకోవడం లేదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను అళగిరి నాయకత్వంలో ఎదుర్కోవడం సమంజసంగా ఉండదని ఇళంగవోన్‌ అన్నారు.

Updated Date - 2023-11-28T08:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising