ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

ABN, Publish Date - Dec 18 , 2023 | 05:12 PM

ల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor case ) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు అరుణ రామచంద్రన్ పిళ్ళై ( Aruna Ramachandran Pillai ) కి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భార్య అనారోగ్య కారణంగా పిళ్ళైకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor case ) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు అరుణ రామచంద్రన్ పిళ్ళై ( Aruna Ramachandran Pillai ) కి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. భార్య అనారోగ్య కారణంగా పిళ్ళైకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్ళై పై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. పిళ్ళై అప్రూవర్‌గా మారతారని ప్రచారం జరిగింది. కాని వాటిని పిళ్ళై తరపు న్యాయవాది ఖండించారు. గతంలోనే అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ మారిన విషయం తెలిసిందే.

ఆరు నెలల్లోపు కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. త్వరలోనే మరో‌చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈడీ ప్రయత్నాలు చేస్తోంది. మళ్లీ తెరపైకి ఢిల్లీ లిక్కర్ కేసు రానున్నట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి ఈ కేసులో విచారణలో వేగం పెంచే యోచనలో దర్యాప్తు సంస్థలు ఉన్నట్లు సమాచారం. మరోసారి ఈ కేసులో లింకు ఉన్న పలువురిని ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసే యోచనలో ఈడీ వర్గాలు ఉన్నాయి.

Updated Date - Dec 18 , 2023 | 05:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising