ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Earthquake:ఢిల్లీ-నేపాల్‌ని మళ్లీ వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదు

ABN, First Publish Date - 2023-11-06T21:29:21+05:30

ఢిల్లీ(Delhi)ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లో 5.6 తీవ్రతతో ఇవాళ భూకంపం(Earthquake) వచ్చింది. ఆ తరువాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - ఎన్ సీఆర్‌లో ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

ఢిల్లీ:ఢిల్లీ(Delhi)ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లో 5.6 తీవ్రతతో ఇవాళ భూకంపం(Earthquake) వచ్చింది. ఆ తరువాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - ఎన్ సీఆర్‌లో ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మూడు రోజుల్లో రెండో సారి భూకంపం రావడం ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల సంభవించిన భూకంపంతో నేపాల్ లో 153 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి.


పశ్చిమ ప్రాంతం జాజర్‌కోట్‌ జిల్లా దీనికి ప్రధాన కేంద్రంగా ఉంది. అక్కడి పర్వతాల్లో గత శుక్రవారం అర్థరాత్రి సమయంలో సంభవించిన భూకంపంలో 153 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మంది పైగా గాయపడ్డారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదైంది. 2015 తర్వాత నేపాల్‌లో ఇదే అత్యంత తీవ్ర భూకంపం ఇదేనంటున్నారు అధికారులు. నాడు 7.8 తీవ్రత నమోదవగా.. 9 వేల మందిని చనిపోయారు. నేపాల్‌లో గడిచిన నెల రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు భూకంపం సంభవించడం అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా, నేపాల్‌(Nepal) భూకంపం తాలూకు ప్రకంపనలు భారత్‌లోనూ కనిపించాయి. ఢిల్లీతో పాటు, యూపీ, బిహార్‌లోనూ భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. నేపాల్ కి తక్షణ సాయం కింద భారత్ రెండు ట్రక్కుల సహాయ సామగ్రి, ఆహారం, బట్టలు, మెడిసన్స్ పంపించింది. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక C-130 విమానం ఆదివారం రూ.10 కోట్ల విలువైన అత్యవసర సహాయ సామగ్రితో నేపాల్‌లో దిగింది. తాజా ఘటనలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

Updated Date - 2023-11-06T21:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising