ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

rahul disqualification: దేశవ్యాప్తంగా రోడ్లపైకి కాంగ్రెస్ శ్రేణులు.. ఢిల్లీలో ప్రియాంక, ఖర్గే సహా అగ్రనాయకత్వం..

ABN, First Publish Date - 2023-03-26T11:30:11+05:30

లోక్‌సభ (Lok Sabha) ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని (rahul disqualification) కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఆదివారం దేశవ్యాప్తంగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: లోక్‌సభ (Lok Sabha) ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని (rahul disqualification) కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. రాహుల్‌కు సంఘీభావంగా ఆదివారం దేశవ్యాప్తంగా ఒక్కరోజు ‘సంకల్ప సత్యాగ్రహ’ (Sankalpa Satyagraha) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకే ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.

ఢిల్లీలో రాజ్‌ఘాట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి (congress party) ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే కారణంగా పర్మిషన్ ఇవ్వడంలేదని తేల్చిచెప్పారు. రాజ్‌ఘాట్ (RajGhat) ప్రాంతంలో సెక్షన్ 144 విధించినట్టు వెల్లడించారు. అయితే పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharghe), ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi), కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్ వంటి అగ్రనాయకులు రాజ్‌ఘాట్ చేరుకున్నారు. కాగా ‘మోదీ ఇంటిపేరు’ కేసులో కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్ట్ తీర్పునివ్వడం, జైలుశిక్ష ఆధారంగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్ నిర్ణయం పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసనగా ఈ సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపడుతోంది.

తగ్గేదేలే అంటున్న రాహుల్...

రెండేళ్లు జైలుశిక్ష విధించినా వెనక్కి తగ్గేదేలేదని రాహుల్ గాంధీ అంటున్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ (Rahul press meet) తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. ‘‘ ఇకపై మాట్లాడకూడదని అనర్హత వేటు వేశారు. జీవితాంతం బహిష్కరించినా వెనక్కి తగ్గేది లేదు. మోదీ, అదానీ మధ్య బంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. అదానీ డొల్ల కంపెనీల్లో 20 వేల కోట్లు పెట్టిందెవరు?. ఆ భయంతోనే ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధం ఇచ్చారు. నా పేరు సావర్కర్‌ కాదు.. గాంధీ.. క్షమాపణ చెప్పను. శాశ్వతంగా వేటు వేసినా, జైలుకు పంపినా పోరాటమే. నాపై అనర్హత వేటు వేయడం, కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం గౌతమ్‌ అదానీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా. మోదీ సర్కారుకు.. అదానీ అంటే దేశం. దేశమంటే అదానీ! వాళ్లు నన్ను శాశ్వతంగా అనర్హుడిని చేసినా సరే.. నా పని నేను చేస్తూనే ఉంటా. జీవితాంతం నన్ను అనర్హుడిగా ప్రకటించినా.. జీవితాంతం జైలుకు పంపినా.. తగ్గేదే లేదు. అదానీ డొల్ల కంపెనీల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందెవరు!? ఇప్పటికీ దీనికి జవాబు చెప్పట్లేదు. జవాబు చెప్పే వరకూ ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉంటా. ప్రధాని సహా బీజేపీ నేతలంతా అదానీని కాపాడుతున్నారు. అదానీపై దాడి అంటే దేశంపై దాడి అంటున్నారు’’ అంటూ రాహుల్ ఘాటుగా స్పందించారు.

Updated Date - 2023-03-26T11:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising