ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విపక్షాల బెంగళూరు సమావేశం వాయిదా.. ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత..

ABN, First Publish Date - 2023-07-03T10:49:03+05:30

విపక్షాల బెంగళూరు సమావేశం వాయిదా పడింది. జూలై 12, 13 తేదీల్లో భేటీ కావాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. గత నెల 23న పాట్నాలో తొలిసారిగా భేటీ అయ్యింది. గత సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : విపక్షాల బెంగళూరు సమావేశం వాయిదా పడింది. జూలై 12, 13 తేదీల్లో భేటీ కావాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. గత నెల 23న పాట్నాలో తొలిసారిగా భేటీ అయ్యింది. గత సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) లో చీలిక నేపథ్యంలో ఈసారి భేటీకి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ తెలిపింది.

కాగా.. తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతలు పాల్గొన్నారు. ఆరోజు జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ మాట్లాడుతూ.. ఇది సిద్ధాంతాల మధ్య పోరు అని పేర్కొన్నారు. నిజానికి, తమలో విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని, సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకునేందుకు కృషిచేయాలని నిర్ణయించామని చెప్పారు. దేశపునాదులపై బీజేపీ దాడి చేస్తోందని, ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని అన్నారు

Updated Date - 2023-07-03T10:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising