ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra modi: ప్రధాని మోదీని కలిసిన యాపిల్ సీఈవో టిమ్ కుక్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్!

ABN, First Publish Date - 2023-04-19T20:54:40+05:30

భారత్‌లో యాపిల్ (Apples store) కంపెనీ రెండవ స్టోర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra modi) కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్ (Apples store) కంపెనీ రెండవ స్టోర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra modi) కలిశారు. మోదీ అనుసరిస్తున్న పాజిటివ్ ఇంపాక్ట్ టెక్నాలజీ విధానాన్ని యాపిల్ కంపెనీ పాటిస్తోందని టిమ్ కుక్ చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు టిమ్ కుక్ ట్వీట్ చేశారు. ‘‘ సాదర స్వాగతం పలికిన ప్రైమ్ మినిస్టర్ మోదీ థ్యాంక్యూ. భారత్ భవిష్యత్‌ను మార్చేయగలదని మీరు విశ్వసిస్తున్న పాజిటివ్ ఇంపాక్ట్ టెక్నాలజీని మేము అనుసరిస్తున్నాం. ఎడ్యుకేషన్, డెవలపర్స్ నుంచి మాన్యుఫ్యాక్చర్స్ వరకు, పర్యావరణం అన్నింటికీ ఉపయుక్తం. భారత వృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం’’ అని టిమ్ కుక్ ట్వీట్ చేశారు.

టిమ్ కుక్ ట్వీట్‌పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ‘‘ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. వేర్వేరు అంశాలపై ఆలోచనలను పరస్పరం పంచుకోవడం హర్షణీయం. భారత్‌లో టెక్ సంబంధిత మార్పులపై మాట్లాకోవడం హైలైట్’’ అని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు.

అంతకుముందు ప్రధాని మోదీతో భేటీకి ముందు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో యాపిల్ సీఈవో టిమ్ కుక్ భేటీ అయ్యారు. కాగా భారత్‌లో మొట్టమొదటి యాపిల్ కంపెనీ రిటైల్ స్టోర్ ముంబైలో ప్రారంభమైంది. ఇక దేశంలో రెండవ యాపిల్ స్టోర్ దేశరాజధాని ఢిల్లీలో టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. కాగా ముంబై స్టోర్ మాదిరిగానే ఢిల్లీలో ప్రారంభించబోయే స్టోర్‌ ముందు కూడా భారీ క్యూ లైన్ ఖాయమనే అంచనాలున్నాయి.

Updated Date - 2023-04-19T21:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising