ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AB InBev India: నీటి పరిరక్షణ కార్యక్రమాలు దేశవ్యాప్త విస్తరణ

ABN, First Publish Date - 2023-03-23T21:22:14+05:30

నీటి పరిరక్షణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: నీటి పరిరక్షణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు ‘ఏబీ ఇన్‌బెవ్ ఇండియా’ (AB InBev India) తెలిపింది. ఈ కార్యక్రమాల ద్వారా 2025 నాటికి రెండు రెట్ల అధికంగా నీటి పరిరక్షణ మెరుగుపరచనుంది. నీటి భద్రతా కార్యక్రమాలను ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్‌‌‌, కర్ణాటకలోని నీటి ఎద్దడి జిల్లాల్లో అమలు చేస్తున్నారు. నీటి పరిరక్షణ, నీటి నాణ్యత, నీటి ప్రాప్యత వంటివాటితో ఈ కార్యక్రమాలను రూపొందించారు. ఫలితంగా ప్రమాదం అంచున ఉన్న కమ్యూనిటీలకు పరిశుభ్రమైన తాగునీరు అందుతుంది.

ఏబీ ఇన్‌బెవ్ ఇండియా ఇప్పుడు స్థానిక రైతులు, కమ్యూనిటీలతో కలిసి పనిచేయడంతో పాటుగా నిలకడతో కూడిన వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా ప్రోత్సహిస్తోంది. నీటి వినియోగం తగ్గించడంతోపాటు అదే సమయంలో భూసారం పెంచడం దీని లక్ష్యం. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రొక్యూర్‌మెంట్, సస్టెయినబిలిటీ (ఇండియా,ఆగ్నేయాసియా) హెడ్ అశ్విన్ కక్ మాట్లాడుతూ.. వ్యాపారాలకు మాత్రమే కాకుండా కమ్యూనిటీలకు కూడా నీరు అనేది ముఖ్యమైన వనరని అన్నారు. తమ నీటి పొదుపు కార్యక్రమాలు, జాతీయ నీటి పరిరక్షణ లక్ష్యాలకు తోడ్పడటంతో పాటు సస్టెయినబల్‌ బిజినెస్‌ ప్రక్రియలలో తమ నాయకత్వ స్ధానం సైతం ప్రదర్శిస్తుందన్నారు.

Updated Date - 2023-03-23T21:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising