ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya Temple: పాలరాతి గర్భగుడిలో ముగ్ద మనోహర 'బాల' రామం

ABN, Publish Date - Dec 27 , 2023 | 05:00 PM

ఆలయ నిర్మాణం దశలను ఎప్పటికప్పుడు కళ్లకుకట్టినట్టు ఫోటోలను విడుదల చేస్తూ వస్తున్న శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ఆలయ ట్రస్టు తాజాగా ఆలయ గర్భాలయంలో ప్రతిష్ఠించనున్న 'రామ్ లాలా' విగ్రహం గురించి ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది.

అయోధ్య: అయోధ్య (Ayodhya)లో కనీవినీ ఎరుగతి రీతిలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామమందిరలో కొలువుతీరే బాలరాముడి (Ram Lalla) కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు. రామజన్మభూమిలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొనగా, ఈ పండుగను ద్విగుణీకృతం చేస్తూ వైదిక ఆచారల ప్రకారం జనవరి 16 నుంచి ప్రాణ్-ప్రతిష్ట వేడుకలు మొదలై, జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవంతో అంబరాన్ని తాకనున్నాయి. ఆలయ నిర్మాణం దశలను ఎప్పటికప్పుడు కళ్లకుకట్టినట్టు ఫోటోలను విడుదల చేస్తూ వస్తున్న శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ఆలయ ట్రస్టు తాజాగా ఆలయ గర్భాలయంలో ప్రతిష్ఠించనున్న 'రామ్ లాలా' విగ్రహం గురించి ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది.


ఐదేళ్ల బాల రాముడు...3 శిల్పాల మధ్య పోటీ

రామాలయంలో తెల్లటి పాలరాతి మక్రానా మార్బెల్‌తో గర్భాలయం తీర్దిదిద్దగా, ఇందులో సహజత్వాన్ని ఉట్టిపడేలా పాలుగారే ప్రాయంతో తీర్చిదిద్దిన ముద్దులొలికే ఐదేళ్ల బాల రాముడు కొలువుతీరబోతున్నాడు. ఇందుకోసం మూడు శిల్పాలు పోటీ పడుతున్నాయి. వీటిని రామ్‌సేవక్‌పురన్‌లో మూసిన తలుపులు వెనుక ముగ్గురు శిల్పులు రూపొందిస్తున్నారు. ఈ శిల్పాలలో ఒక శిల్పాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించేందుకు ఎంపిక చేస్తారు. హెరిటేస్ సైన్స్ నిపుణులు, నలుగురు శంకరాచార్యులు, సాధుసంతులు ఈ విగ్రహాన్ని ఎంపిక చేస్తారు. గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహం ఎప్పటికీ అక్కడే స్థిరంగా ఉంటుంది. 51 అంగుళాల ఎత్తుతో ఈ బాలరాముని విగ్రహం ఉంటుంది. తక్కిన రెండు శిల్పాలను ఆలయంలోనే వేరే చోట ఉంచుతారు. 1949లో బాబ్రీ మసీదులో కనిపించి, ప్రస్తుతం తాత్కాలిక ఆలయం వద్ద ఉన్న తెల్లటి పాలరాతి చిన్న విగ్రహాన్ని కదిలే విగ్రహంగా పండుగల సమయంలో రథంపై బయటకు తీసుకువెళ్తారు.


21 లక్షల క్యూబిక్ ఫీట్ల స్టోన్..

రామాలయ నిర్మాణం కోసం 21-22 లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని వినియోగిస్తున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇంత పెద్ద రాతితో నిర్మించిన కట్టంలో గత 100-200 ఏళ్లలో ఇటు ఉత్తర భారతంలో కానీ, దక్షిణ భారతంలో కానీ లేదని వివరించారు. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్ నుంచి గ్రానైట్, పింక్ కలర్ ఇసుకరాయి వంటివి తెప్పించామని తెలిపారు. గర్భగుడి పూర్తిగా తెల్లటి మక్రానా మార్బెల్‌తో నిర్మించామని, ఆలయంలో రామ్‌లాలా ప్రతిష్టాపనకు గర్భగుడి సర్వసన్నద్ధంగా ఉందని వివరించారు.


మరిన్ని ఆసక్తికర విషయాలు..

సుప్రీంకోర్టు 2019లో హిందువులకు అప్పగించిన 70 ఎకరాల స్థలంలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది. మూడంతస్తుల్లో ఈ నిర్మాణం సాగుతోంది. ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రౌండ్‌ ఫ్లోర్ ముస్తాబవుతోంది. ఆలయం నాలుగువైపులా అద్భుతమైన రీతిలో ప్రాకారం నిర్మిస్తున్నారు. రన్నింగ్ లెంగ్త్ సుమారు 750 మీటర్ల వరకూ ఉంటుంది. ఆలయానికి రక్షణ గోడ 14 అడుగుల వెడల్పుతో తన ప్రత్యేకతను చాటుకోనుంది. ప్రాకారం రెండంతస్తుల్లో డవలప్‌ చేస్తున్నారు. ఆలయం పై ఫ్లోర్‌లో (అప్పర్ ఫ్లోర్)లో పరిక్రమ కోసం భక్తులను అనుమతించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాకారం మరో 6 నుంచి 8 నెలల్లో పూర్తవుతుందని చంపత్ రాయ్ తెలిపారు.


విశేష సౌకర్యాలు...

ఆలయాన్ని విచ్చేసే యాత్రికుల సౌకర్యం కోసం టెంపుల్ ట్రస్టు చక్కటి సదుపాయాలు కల్పిస్తోంది. పిలిగ్రిమ్ ఫెసిసిటీ సెంటర్ (పీఎఫ్‌సీ)లో 25,000 యాత్రికులకు లాకర్ సౌకర్యాలు కల్పించనున్నారు. పీఎఫ్‌సీ సమీపంలోనే ఒక చిన్న ఆసుపత్రి నిర్మిస్తున్నారు. టాయెలెట్లు ఇతర సౌకర్యాల కోసం పెద్ద కాంప్లెక్స్, రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పవర్ హౌస్ నుంచి నేరుగా విద్యుత్ సరఫరాకు వీలుగా ఆలయ ప్రాంగణంలోనే 33 కెడ్ల్యూ పవర్ హౌస్, రిలీవింగ్ స్టేషన్లు, మూడు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్ట్రిక్ లైన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఫైర్ బ్రిగేడ్‌కు నీళ్లు అవసరం తీర్చేందుకు కట్టడం సమీపంలో అండర్‌గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్‌ తవ్వుతున్నారు. మొత్తం 20 ఎకరాల్లో నిర్మాణాలు జరుపుతారు. 50 ఎకరాల్లో గ్రీనరీ ఉంటుంది. సూర్య కిరణాలు కూడా పడనంతంగా దట్టంగా ఇక్కడ వృక్షాలు పెంచుతారు. ఇందువల్ల భూమిలోపలి జలాలు ఎక్కడికీ పోకుండా స్థిరంగా ఉంటాయి. జీరో డిశ్చార్జ్ పాలసీ ద్వారా జలాలు సరయు నదలోకి వెళ్లకుండా చూస్తారు.


ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని

అయోధ్యలోని ఆరురోజుల పాటు జరిగే కార్యక్రమాల చివరిరోజైన జనవరి 22న రామాలయం ప్రారంభానికి, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే వేడుకలకోసం వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం అధికారులు మెరుగైన భద్రతా చర్యలు, వసతులు కల్పిస్తున్నారు. తాత్కాలిక గ్రామాలు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యాన్నధార సమారాధనకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated Date - Dec 27 , 2023 | 07:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising