ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSPSC: సన్నిహితుల దగ్గర గోడువెళ్లబుచ్చుకున్న చైర్మన్!

ABN, First Publish Date - 2023-03-16T13:12:12+05:30

ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం (TSPSC paper leak)తో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ ) చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి (Janardhan Reddy) తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు

Janardhan Reddy

ఒత్తిడిలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌!

ఇంటా.. బయట విమర్శలతో ఉక్కిరిబిక్కిరి..

సన్నిహితుల వద్ద జనార్దన్‌రెడ్డి ఆవేదన

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం (TSPSC paper leak)తో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ ) చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి (Janardhan Reddy) తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో సమర్థంగా పనిచేసే సిబ్బంది కొరత ఉండడం, బయటి నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో ఇబ్బందికి గురవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కమిషన్‌ చైర్మన్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై రాజకీయ పార్టీలతోపాటు, విద్యార్థి సంఘాలు కూడా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చైర్మన్‌ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే కార్యాలయంలో తగినంత మంది సిబ్బంది లేక, ఉన్నవారితోనే నెట్టుకొస్తూ చైర్మన్‌ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో 83 మంది రెగ్యులర్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. సాధారణంగా ఒక్క ఏడాదిలో అత్యధికంగా 2-3వేల పోస్టులు భర్తీ చేసిన రికార్డు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కి ఉంది. కానీ, ఈ ఏడాది ఏకంగా 23వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో గ్రూపు-1, 2, 3, 4 వంటి ముఖ్యమైన పోస్టులూ ఉన్నాయి. దాంతో కమిషన్‌ చైర్మన్‌తోపాటు ఇతర సిబ్బందిపైనా కొంత ఒత్తిడి ఉంది.

ఉద్యోగాల భర్తీకి చేపడుతున్న పనుల కోసం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు కార్యాలయంలోనే ఉంటున్నారు. నియామకాల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా.. కొంత మంది ఉద్యోగుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా తన రాజీనామాకు డిమాండ్‌ చేస్తుండడంతో ఆయన మరింత ఒత్తిడికి గురయ్యారని సమాచారం. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ.. పదవి నుంచి తప్పుకొంటే (రాజీనామా) ఎలా ఉంటుందని అన్నట్లు తెలిసింది. అయితే.. ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని, అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సన్నిహితులు ఆయనకు సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని సిబ్బందిని ప్రక్షాళన చేసే పనిలో కమిషన్‌ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా కీలకమైన పోస్టుల్లో కొనసాగుతున్న వారిని మరోసారి పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. వీరితోపాటు ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో నిబద్ధతగా పనిచేస్తున్న వారిని గుర్తించి, డిప్యుటేషన్‌, లేదా ఇతర మార్గాల్లో టీఎస్‌పీఎస్సీ (TSPSC) లోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం.. నిబంధనలు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2023-03-16T13:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising