ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai Gangster: బాంబు తయారు చేస్తుండగా పేలుడు.. రెండు చేతులు కోల్పోయిన గ్యాంగ్‌స్టర్

ABN, First Publish Date - 2023-02-05T19:31:58+05:30

నాటు బాంబు(Crude Bomb) తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నాటు బాంబు(Crude Bomb) తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో ఓ గ్యాంగ్‌స్టర్(Gangster) రెండు చేతులు కోల్పోయాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ ఘటన. గ్యాంగ్‌స్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. చెన్నైకి చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ఒట్టెరి కార్తి పుళల్ జైలులో ఉన్నప్పుడు విజయ్ కుమార్ అనే మరో నేరస్థుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అంబత్తూరులోని అరగడం సమీపంలో కుక్కపిల్లను కొనుగోలు చేసే నెపంతో విజయ్‌కుమార్ వద్దకు వెళ్లాడు.

విజయ్ కుమార్ ఇంటికి వచ్చిన కార్తి ఆయన ఇంటిపై నాటు బాంబు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాంబు పేలడంతో కార్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. చేతులు పూర్తిగా ఛిద్రం కావడంతో తీసేయాలని వైద్యులు నిర్ణయించారు. అతడి కాళ్లకు కూడా తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆపై ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. బాంబు తయారీ వెనక ఉన్న కారణంపై ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-02-05T19:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising