ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold Seized: గుట్టుగా కాఫీ మిషీన్‌లో తీసుకెళ్తున్న 3.5 కిలోల గోల్డ్..అడ్డంగా దొరికిన కేటుగాళ్లు

ABN, Publish Date - Dec 31 , 2023 | 06:31 PM

స్మగ్మర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుత్తడిని అక్రమంగా రవాణా చేసేందుకు పలు రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్రమంగా తరలిస్తున్న 4 కేజీలకుపైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గుట్టుచప్పుడు కాకుండా బంగారం తీసుకెళ్తున్న దుండగులను అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో లక్నో(lucknow) విమానాశ్రయంలో స్మగ్లింగ్‌కు సంబంధించిన రెండు కేసులను కస్టమ్స్ అధికారులు చేధించారు. లక్నో విమానాశ్రయంలో తెల్లవారుజామున 5 గంటలకు 4.05 కిలోల బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న బంగారం విలువ రూ.2.55 కోట్లు అని అధికారులు తేల్చారు.


మొదటి కేసులో 3.497 కిలోల బంగారాన్ని కాఫీ మిషన్‌లో దాచి ఉంచగా స్కాన్‌లో అనుమానం వచ్చి పరిశీలించగా అందులో రెండు స్థూపాకార బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. అయితే వాటిని తీసేందుకు అధికారులు కాఫీ యంత్రాన్ని(coffee machine) సుత్తితో పగులగొట్టి వాటిని తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి ఫ్లైట్ IX 194లో తీసుకొచ్చారు.

రెండో కేసులో ఓ స్మగ్లర్ పురీషనాళం నుంచి 554 గ్రాముల బంగారాన్ని(gold) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికుడు షార్జా నుంచి విమానం నంబర్ 6E1424 ద్వారా వచ్చాడు. మరోవైపు ఇటీవల ఐజీఐ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ప్రొఫైలింగ్ ఆధారంగా దుబాయ్ నుంచి వస్తున్న ముగ్గురు విదేశీయులను పట్టుకున్నారు. ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ చట్టం 1962 కింద అరెస్టు చేశారు. ఈ ముగ్గురు స్మగ్లర్లు తమ ప్యాంటు, లోదుస్తుల్లో దాచిపెట్టి బంగారాన్ని తీసుకొచ్చారు.

Updated Date - Dec 31 , 2023 | 06:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising