ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget2023 Cigarette Tax: సిగరెట్లపై 16 శాతం ట్యాక్స్ పెంపుతో రేటు పెరిగేదెంతంటే..

ABN, First Publish Date - 2023-02-01T17:22:32+05:30

‘‘ సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ.. సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ.. పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి ఇది తొలి మెట్టు.. సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ ’’ అంటూ పొగరాయుళ్ల అనుభూతిని రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి గారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘‘ సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ.. సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ.. పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి ఇది తొలి మెట్టు.. సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ ’’ అంటూ పొగరాయుళ్ల (Smoking lovers) అనుభూతిని రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి గారు ‘రాముడు-భీముడు’ సినిమాలోని ఒక పాట ద్వారా చాలా చక్కగా అభివర్ణించారు. అయితే ధూమపాన ప్రియులు (Smoking lovers) ఇకపై ఈ ఫీలింగ్‌ను ఆస్వాదించాలంటే ఖర్చు కాస్త ఎక్కువ పెట్టాల్సిందే. ఎందుకంటారా?.. సిగరెట్లపై (Cigarette) కస్టమ్స్ డ్యూటీని (Customs Duty) ఏకంగా 16 శాతం మేర పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023లో (Union Budget2023) ప్రకటించారు.

బడ్జెట్ (Budget2023) ప్రతిపాదనతో సిగరెట్లపై నికర పన్ను (Net Tax) ఒక్కో స్టిక్‌పై 0.07 శాతం మేర పెరిగి 0.12 శాతానికి పెరగనుంది. అంటే.. సిగరెట్ల రకాన్ని బట్టి ప్రస్తుతమున్న ధరలు 1 - 3 శాతం వరకు పెరగనున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. పన్ను పెంపు మరీ అంత ఎక్కువేంకాదని, ఈ పెంపు కారణంగా సిగరెట్ల రేట్లు 1 - 3 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా సిగరెట్ ధరల పెంపు ప్రతిపాదనతో గోడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా (Godfrey Phillips india), ఐటీసీ లిమిటెడ్ (ITC Limited) కంపెనీల షేర్లు బుధవారం నష్టాలను చవిచూశాయి. సీతారామన్ ప్రకటన అనంతరం ఈ రెండు కంపెనీల షేర్లు 5 శాతానికిపైగా దిగజారాయి. ఇక ఎన్‌టీసీ ఇండస్ట్రీస్ షేర్లు 1.4 శాతం, వీఎస్‌టీ ఇండస్ట్రీస్ షేర్లు స్వల్పంగా 0.35 శాతం మేర దిగజరాయి. మరోవైపు సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ పెంపుపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. నవ్వులు పూయిస్తున్నాయి.

ఇక సిగరెట్ల సంగతి పక్కనపెడితే.. టెక్స్‌టైల్స్, వ్యవసాయేతర వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (Customs Duty) 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. తదనుగుణంగా ఆట బొమ్మలు, సైకిళ్లు, ఆటోమొబైల్స్ సహా పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలు, సెస్సులు, సర్‌ఛార్జీలు స్వల్పంగా మారనున్నాయి.

Updated Date - 2023-02-01T17:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising