ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ola: మరో 200 మంది ఉద్యోగులకు షాకిచ్చిన ఓలా

ABN, First Publish Date - 2023-01-13T15:32:50+05:30

సిబ్బంది తొలగింపు (Lay offs) ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు, క్యాబ్ సర్వీసుల కంపెనీ ‘ఓలా’ (Ola) తాజాగా మరో 200 మంది ఉద్యోగులపై వేటువేసింది. టెక్నాలజీ, ప్రొడక్ట్ టీమ్‌ నుంచి వీరిని తొలగిస్తున్నట్టు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: సిబ్బంది తొలగింపు (Lay offs) ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు, క్యాబ్ సర్వీసుల కంపెనీ ‘ఓలా’ (Ola) తాజాగా మరో 200 మంది ఉద్యోగులపై వేటువేసింది. టెక్నాలజీ, ప్రొడక్ట్ టీమ్‌ నుంచి వీరిని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కసరత్తు చేపట్టినట్టు ఓలా వివరించింది. కాగా 2022లో మొత్తం 1100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీ తాజా మరో దఫా తొలగింపులను ప్రవేశపెట్టినట్టయ్యింది. గతేడాది తొలగింపుల్లో ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఇక తాజా తొలగింపులు ఈ వారమే మొదలయ్యాయని ‘ఐఎన్‌సీ42’ (Inc42) రిపోర్ట్ పేర్కొంది. భవిష్ అగర్వాల్ (Bhavish Agarwal) సారధ్యంలోని ఓలా కంపెనీ (Ola Company) గడిచిన 7 నెలల్లో వెయ్యిమందికిపైగా ఉద్యోగులను తొలగించిందని ప్రస్తావించింది. ఈ విషయాన్ని ఓలా ప్రతినిధి ఒకరు నిర్ధారించారు.

Updated Date - 2023-01-13T15:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising