Minister Roja: పవన్ కల్యాణ్ వాలంటీర్ల కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి... లేదంటే..
ABN, First Publish Date - 2023-07-11T18:38:51+05:30
మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా... మాట్లాడితే హైదరాబాద్‌లో ఉండలేవు.
అమరావతి: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) విమర్శలు గుప్పించారు.
"ఇరిటేషన్ స్టార్ రెండు రోజులుగా వాలంటీర్లను, సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే. వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు. 2024లో ఓడిపోతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి అర్ధం అయింది. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ సిగ్గు లేకుండా చదువుతున్నారు. పవన్ వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. లేదంటే వాళ్లే పవన్ సంగతి తెలుస్తారు. మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుంది అని మాట్లాడటం సిగ్గు చేటు. పవన్ కళ్యాణ్‌కు సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు?. వార్డ్ మెంబర్ కూడా గెలవని నీకు సమాచారం ఎవరు ఇచ్చారు." అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా... మాట్లాడితే హైదరాబాద్‌లో ఉండలేవు. బాలకృష్ణ జనసేన వాళ్ళను అలగా జనం అన్నారు. అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎలా వెళ్ళావు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల పేరు ఎత్తి మాట్లాడారా? సాక్షత్ ముస్సోరి IAS సిలబస్ లో వాలంటీరి వ్యవస్థ గురించి పెట్టారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ సచివాలయానికి అయినా వేళ్దాం." అని మంత్రి రోజా అన్నారు.
Updated Date - 2023-07-11T18:42:35+05:30 IST