ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Chiranjeevi Rao: ‘ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిపించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు’

ABN, First Publish Date - 2023-03-18T15:06:46+05:30

34 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిపించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు కృతజ్ఞతలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: 34 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ (Uttarandra MLC) గా గెలిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు (MLC Vepada Chiranjeevi Rao) కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు (TDP Leader), కేడర్ తన గెలుపునకు విశేష కృషి చేశారన్నారు. అందరి సహకారంతో 30 రోజుల్లో 34 నియోజకవర్గాల్లో ప్రచారం చేసినట్లు తెలిపారు. తన విద్యార్థులు గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి పనిచేశారన్నారు. తనకు సహకరించిన మిత్రులను అనేక విధాలుగా వేధించారన్నారు. తన విజయానికి సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయాల్లో ఈ ఎన్నిక మంచి మార్పు అవుతుందని అందరూ భావించారన్నారు. రాబోయే రోజుల్లో తనలాంటి వారు రాజకీయాలకు రావడానికి బాట పడిందని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సరైన సమయంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని.. అందరూ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార కోసం కృషి చేస్తానని చిరంజీవి రావు హామీ ఇచ్చారు.

కాగా... ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అయితే కౌంటింగ్ పూర్తి అయినప్పటికీ డిక్లరేషన్ విషయంలో సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ అనుమతితో చిరంజీవి రావుకు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.

రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించినప్పుడు పోటీదారుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన (చివరి నుంచి) అభ్యర్థి బ్యాలెట్లను తీసి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అలా ఆ తరువాత అతనిపైనున్న అభ్యర్థి... ఆ తరువాత ఇంకొకరి రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు విజయానికి అవసరమైన ఓట్లు 11,551. పోటీ చేసిన 37 మందిలో 34 మందికి డిపాజిట్లు దక్కలేదు. వారిలో 33 మందికి కలిసి సుమారు వేల ఓట్లు వచ్చాయి. అధికారులు వాటన్నింటినీ కలిపేసి...ద్వితీయ ప్రాధాన్య ఓట్లు లెక్కించగా టీడీపీ అభ్యర్థికి 786 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు వచ్చిన 10,884 ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపును రాత్రి పది గంటల సమయంలో ప్రారంభించారు. ఇందులో టీడీపీ 3,000, వైసీపీకి 1,360 ఓట్లు లభించాయి. దాంతో పీడీఎఫ్‌ అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభ ఓట్ల నుంచి తొలుత 15,100 తీసుకున్నారు. అందులో టీడీపీకి 6,678 ఓట్లు రాగా, వైసీపీకి 2,025 వచ్చాయి. అప్పటికి అవసరమైన 11,551 ఓట్లు రావడంతో టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు గెలిచినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే రాత్రి 12.30 గంటల సమయానికి అధికారికంగా ప్రకటించలేదు. ఈరోజు ఉదయం టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లుగా అధికారికంగా ప్రకటించి.. డిక్లరేషన్‌ను అందజేశారు.

Updated Date - 2023-03-18T15:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising