ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vishnu Kumar Raju: కుట్రతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు

ABN, First Publish Date - 2023-09-12T15:21:04+05:30

జీ 20 సమావేశాలను ఆంధ్రా ప్రజలు చూడనీయకుండా చేశారు. ముందుస్తు ప్రణాళిక రచించి చంద్రబాబుని అరెస్టు చేశారు. న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయంపై హైకోర్డు అంతర్గత కమిటీ వేయాలి. లేకపోతే ప్రజలకు

విశాఖ: చంద్రబాబు అరెస్టులో (Chandrababu Arrest) కుతంత్రం ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్టుకుమార్ రాజు (Vishnu Kumar Raju) అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జీ 20 సమావేశాలను ఆంధ్రా ప్రజలు చూడనీయకుండా చేశారు. ముందుస్తు ప్రణాళిక రచించి చంద్రబాబుని అరెస్టు చేశారు. న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయంపై హైకోర్డు అంతర్గత కమిటీ వేయాలి. లేకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థ మీద గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. మీ బాబాయ్‌ని చంపిని వారిని మీరు బ్రహ్మాండంగా కాపాడుతున్నారని ప్రజలకు కూడా తెలుసు. జగన్‌పై 30కి పైగా కేసులు ఉన్నా అవి ముందుకు సాగడం లేదు. చంద్రబాబు సభలకు ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. ప్రజల నుంచి దూరం చేయడానికే ఈ కుట్ర. లోకేష్ యువగళం పాదయాత్రను ఆపాలని చూస్తున్నారు. బాబు జైలుకు వెళ్తే వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం తప్పు.’’ అని చెప్పారు.

పవన్‌‌పై ప్రసంశలు జల్లు

‘‘ఏపీలో జరుగుతున్న ఆరాచక శక్తులపై పోరాడుతున్న పవన్‌కి అభినందనలు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఏపీకి వస్తున్న పవన్‌ను అడ్డగించడం అప్రజాస్వామికం.’’ అని విష్టుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-12T15:21:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising