ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tulasi Reddy : వారికి ఓటేస్తే మోదీకి వేసినట్టే.. మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టే..

ABN, First Publish Date - 2023-11-09T13:59:23+05:30

ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని ఏపీసీసీ నేత తులసి రెడ్డి పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ఉన్న మణిపూర్‌లో పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవచ్చన్నారు. రాయలసీమకు పంగనామాలు, రైల్వే జోన్, పోలవరం లేదన్నారు. ఆఖరికి కృష్ణా జలాల పంపిణీలో కూడా మనకు అన్యాయం జరిగిందని తులసిరెడ్డి పేర్కొన్నారు.

అనంతపురం : ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని ఏపీసీసీ నేత తులసి రెడ్డి పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ఉన్న మణిపూర్‌లో పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవచ్చన్నారు. రాయలసీమకు పంగనామాలు, రైల్వే జోన్, పోలవరం లేదన్నారు. ఆఖరికి కృష్ణా జలాల పంపిణీలో కూడా మనకు అన్యాయం జరిగిందని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇక చివరకు మనకు తాగునీరుకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.

ప్రాంతీయ పార్టీ అధినేతలు ముగ్గురూ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే భజనలు చేస్తున్నారని తులసిరెడ్డి విమర్శించారు. కీలుబొమ్మ పార్టీలతో రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందని ప్రశ్నించారు. కరువు ఇంతలా వచ్చి ఉంటే వైసీపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేసినా.. వైసీపీ అధినేత జగన్‌కు.. అలాగే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓటేసినా.. మోదీకి ఓటేసినట్టేనని పేర్కొన్నారు. వీరికి ఓటేస్తే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టేనని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-09T13:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising