ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: లోకేష్ పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషం

ABN, First Publish Date - 2023-06-02T10:54:56+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరులో వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషమని పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్రపై (YuvaGalam Padayatra) ప్రొద్దుటూరులో వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషమని పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా (TDP Leader Bonda Uma) మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి సొంత జిల్లాలోనే వైసీపీ ఉనికి కోల్పోయే పరిస్తితిని తట్టుకోలేకే ఈ దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో లోకేష్ పాదయాత్రకు (Lokesh Padayatra) అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు భద్రత పెంచాలని అన్ని అనుమతులు ఉన్నా... వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సమక్షంలో దాడి చేశారన్నారు. లోకేష్ పాదయాత్రకు భద్రత పెంచమని డీజీపీని కలుస్తామని తెలిపారు. నిన్న లోకేష్ పాదయాత్రపై వైసీపీ దాడిని ప్రజలే తిప్పి కొట్టారని బోండా ఉమా పేర్కొన్నారు.

కాగా.. లోకేష్‌ యువగళం పాదయాత్ర 113వ రోజు ప్రొద్దుటూరులో జరిగింది. ఈ క్రమంలో పాదయాత్రలో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. లోకేష్‌పై వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివాలయం సెంటరులో బహిరంగసభ అనంతరం ఆయన మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కొత్తపల్లి బైపాస్‌ మీదుగా కొత్తపల్లి పీఎన్‌ఆర్‌ ఎస్టేట్‌ వద్ద విడిదికేంద్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జనాలను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ కొత్తపల్లి రిలయన్స్‌ పెట్రోలుబంకు సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వైసీపీ కార్యకర్త లోకేశ్‌పై గుడ్డు విసిరారు. అది బద్వేలు టీడీపీ నేత రితీశ్‌కుమార్‌రెడ్డిని, లోకేశ్‌ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై సీఐ రాజారెడ్డిని లోకేష్‌ ప్రశ్నించారు. మాపై దాడులు జరిగితే ఏం చేస్తున్నారని అడిగారు. మీరు ఫ్లెక్సీలు చించారంటూ సీఐ రాజారెడ్డి మాట్లాడడంతో లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-02T11:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising