ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: అక్కడ టికెట్ రాలేదని ఇక్కడకు వస్తామంటే ఎలా?.. వైసీపీ అసంతృప్తులపై చంద్రబాబు

ABN, Publish Date - Dec 14 , 2023 | 04:43 PM

Andhrapradesh: రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ప్రకటనపై పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పొత్తులో ఉన్నామని.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని తెలిపారు.

అమరావతి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. దీనికి సంబంధించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని స్పష్టత ఇచ్చారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోందని చెప్పారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకని అన్నారు. అక్కడ టిక్కెట్ రాలేదని తమ దగ్గరకు వస్తామంటే తమకు అవసరం లేదన్నారు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామన్నారు.


మద్యపాన నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగన్‌కు ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ఈ రాష్ట్రంలో ఓటు వేయొద్దని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారని నిలదీశారు. జగన్ చేసేవన్నీ చెత్త పనులే అని మండిపడ్డారు. రుషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా అని అని నిలదీశారు. రుషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా అని ప్రశ్నించారు. చట్టం సీఎంకు వర్తించదా అని నిలదీశారు. జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదన్నారు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారు.. తరలింపు సాధ్యమా..? ఎలా తరలిస్తారని అడిగారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - Dec 14 , 2023 | 04:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising