ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan : జగన్ ఢిల్లీ పర్యటనలో సడెన్‌గా మార్పులు

ABN, First Publish Date - 2023-03-30T10:30:59+05:30

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. సుమారు 40 నిముషాల పాటు అమిత్ షా నివాసంలో జగన్ గడిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఢిల్లీ పర్యటన (Delhi Tour)లో భాగంగా గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిశారు. సుమారు 40 నిముషాల పాటు అమిత్ షా నివాసంలో జగన్ గడిపారు. అయితే తొలుత నేటి ఉదయం 9:30 గంటలకు జగన్ విజయవాడకు బయలుదేరుతారని మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ సడెన్‌గా ఆయన పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. మరికొద్ది సేపటి లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)ను ఆయన కలవనున్నారు. ఈ రోజు జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వలేనని మొదట నిర్మలా సీతారామన్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో రావాలని జగన్‌కి ఆమె నుంచి పిలుపు అందడంతో తన పర్యటనలో మార్పులు చేసుకున్నారు. నిర్మల భేటీ అనంతరం ఆయన విజయవాడ బయలుదేరుతారని తెలుస్తోంది.

అటు వైఎస్‌ వివేకానందరెడ్డి (YS Viveka) హత్య కేసులో కీలక పరిణామాలు... ఇటు కర్ణాటక ఎన్నికల (Karnataka Elections)కు మోగిన నగారా... వేడెక్కిన రాజకీయ వాతావరణం మధ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జగన్‌ ఢిల్లీ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన సమావేశమవుతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ... అనూహ్యంగా బుధవారం రాత్రే అమిత్‌ షాతో అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. రాత్రి 11 గంటల వరకు అమిత్‌ షా పిలుపుకోసం సీఎం వేచి చూశారు. రాత్రి 11 గంటలకు పిలుపు రావడంతో హోంమంత్రి నివాసానికి వెళ్లి ఆయన చర్చలు జరిపారు. అర్ధరాత్రి 11.40 గంటలకు భేటీ ముగించుకుని బయటికి వచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అమిత్‌ షా సీఎం వద్ద ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో... ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర సహకారం అవసరమని, పెండింగ్‌ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశంకానున్నారు. 15 రోజుల వ్యవధిలో జగన్‌ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన చర్చలు జరిపారు.

Updated Date - 2023-03-30T10:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising