ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

ABN, Publish Date - Dec 27 , 2023 | 11:37 AM

Andhrapradesh: తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగుముందుకు వేశారు. ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం: తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగుముందుకు వేశారు. ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasadrao) ఇంటిని అంగన్వాడీలు ముట్టించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మాన ప్రసాధరావు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి ధర్మాన ప్రసాద్ ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండల్లో మేము ఏసీల్లో మీరా అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. నిన్న ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. నిన్న అంగన్వాడీలను ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చర్చలకు ఆహ్వానించారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలోచిస్తామని మంత్రులిద్దరు చెప్పగా.. కనీస వేతనం ఇప్పుడు పెంచమని మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ రెడ్డి తేల్చి చెప్పేశారు. వేతనం పెంచితే తప్ప సమ్మె ఆపమని అంగన్వాడి కార్యకర్తలు తేల్చి చెప్పారు.

Updated Date - Dec 27 , 2023 | 11:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising