ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ దేనికైనా బరితెగించవచ్చు.. షర్మిల, విజయలక్ష్మి జాగ్రత్తగా ఉండటం మంచిది: డీఎల్‌

ABN, First Publish Date - 2023-04-14T19:01:47+05:30

మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) సీఎం జగన్‌కు ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మైదుకూరు: మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) సీఎం జగన్‌కు ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రాదని స్పష్టమైందన్నారు. గతంలో తన కుటుంబసభ్యుల మరణాల సానుభూతితోనే.. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రజా వ్యతిరేకత వల్ల జగన్‌రెడ్డి దేనికైనా బరితెగించవచ్చని, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయలక్ష్మి (Vijayalakshmi) జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచించారు. అధికార దాహం కోసం జగన్‌ సమీప కుటుంబసభ్యులను కూడా హత్యలు చేసేందుకు వెనకాడరని డీఎల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో భారతి రాజ్యాంగం నడుస్తోందని, కానీ అంబేడ్కర్‌ (Ambedkar) రాజ్యాంగం ప్రకారం ఎప్పటికైనా శిక్ష పడుతుందని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ సలహా మేరకే కోడి కత్తి, ఎంపీ వివేకా హత్యలతో అధికారం చేపట్టాడని, ఇప్పుడు మరింత అధికార దాహంతో కుటుంబ సభ్యులను కూడా హత్యలు చేసేందుకు వెనుకాడరన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న విజయమ్మ, షర్మిల వద్దకు ఎవరొచ్చి ఏమి మాట్లాడినా క్షణాల్లో సీఎం జగన్‌కు తెలిసిపోతోందని, అంతగా నిఘా పెట్టారని తెలిపారు. కోడికత్తి కేసులో కుట్రలేదని ఎన్‌ఐఏ తెలిపినా జగన్‌ వినిపించుకోలేదన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై రుద్ది ఇప్పుడు వివేకా హత్యలో సునీల్‌ యాదవ్‌ తల్లితో అక్రమ సంబంధం అనడం సిగ్గుచేటని అన్నారు. కేసును ఆలస్యం చేసేందుకే రోజుకొక పిటిషన్‌ వేస్తున్నారని, హత్య చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు. ఇప్పటికే చాలామంది మంత్రులు, శాసన సభ్యులందరూ అసమ్మతిలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. జగన్‌ మనస్సులో పడిందని అందుకనే డొంకతిరుగుడు చర్యలకు పాల్పడుతున్నాడని డీఎల్ రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2023-04-14T19:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising