ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం

ABN, First Publish Date - 2023-05-31T19:41:11+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని సీపీఐ నేత రామకృష్ణ (Ramakrishna) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని సీపీఐ నేత రామకృష్ణ (Ramakrishna) అన్నారు. జూన్‌ 7న జగన్ అత్యవసర కేబినెట్ మీటింగ్ అంటున్నారని, జగన్ ముందస్తుకు వెళ్తే ముందే పోతాడని సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ రంగంపై మాట్లాడితే జగన్ ప్రభుత్వం ఉరి వేసుకుంటుందని, ఏపీ ఐటీ ఎగుమతులు కేవలం 0.14 శాతమే అని, జగన్ తమ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.

ఇటీవల సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కార్పోరేట్లకు, బడా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికేనా అని ప్రశ్నించారు. అదానీకి, తమ కడప మిత్రులకు ప్రయోజనం చేకూర్చేందుకు అవసరం లేకున్నా స్మార్ట్ మీటర్లు ప్రజల నెత్తిపై రుద్దడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇళ్లు కట్టుకోవడానికి ఎకరాల భూమి కావాలి కానీ.. పేదలకు మాత్రం సెంట్ భూమి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆర్-3 జోన్‌లో 3 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టి ఇవ్వాలని.. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఇక్కడే పేదలకు ఇళ్లు కట్టించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-31T19:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising