ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somireddy: బటన్ నొక్కుడుతో రైతులకు ఒరిగిందేమీ లేదు

ABN, First Publish Date - 2023-02-28T16:22:58+05:30

వైసీపీ ప్రభుత్వం (YCP Government) గోరంత సాయం చేస్తూ, కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. మూడున్నరేళ్లలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన

ఒరిగిందేమీ లేదు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు: రైతులకు, వ్యవసాయరంగానికి జగన్మోహన్ రెడ్డి (jagan) చేసింది శూన్యం అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వం (YCP Government) గోరంత సాయం చేస్తూ, కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. మూడున్నరేళ్లలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం. రూ.1,45,750 కోట్లు రైతులకు ఖర్చుపెట్టినట్టు ప్రకటనల్లో చెప్పడం పచ్చిఅబద్ధం. వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు.. ఖర్చుపెట్టిన నిధులపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? బటన్ నొక్కుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి రైతుల గొంతు నొక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్స్‌కి చేరింది. నేడు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కింద ఇస్తున్న రూ.1090 కోట్లలో, కేంద్ర వాటా రూ.1000 కోట్లు పోను, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.90 కోట్లు మాత్రమే. విద్యుత్ సబ్సిడీ, ధాన్యం కొనుగోళ్లకు తన ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టిందని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రైతులకు ఉచిత విద్యుత్ (Free electricity) అందుతోందా? ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల పంపిణీ ఈ ప్రభుత్వమే కొత్తగా చేస్తోందా? చంద్రబాబు రైతు రుణమాఫీ కోసం కేటాయించిన రూ.3,500 కోట్లను వారి ఖాతాల్లో జమ కాకుండా అడ్డుకున్న జగన్.. రైతుల్ని ఆదుకుంటారా? జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఉద్ధరిస్తే ధాన్యం సేకరణ, మద్ధతు ధర కల్పనలో రాష్ట్రం విఫలమైందని సీ.ఏ.సీ.పీ ఎందుకు చెప్పింది? రైతు ఆత్మహత్యల్లో, రైతు కుటుంబాల అప్పుల్లో రాష్ట్రం ముందంజలో ఉండటమేనా మూడున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి సాధించిన వ్యవసాయ ప్రగతి? స్వర్గీయ ఎన్టీఆర్ రోజులో 18 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించి, హర్స్ పవర్‌కు కేవలం రూ.50 మాత్రమే రైతుల నుంచి వసూలు చేశారు. మైక్రో ఇరిగేషన్‌కు టీడీపీ ప్రభుత్వం (TDP Government) ఒక్క సంవత్సరంలో రూ.1264 కోట్లు ఖర్చుపెడితే.. జగన్ రెడ్డి మూడేళ్లలో రూ.1264 కోట్లు ఖర్చుపెట్టారు.’’ అని సోమిరెడ్డి వివరించారు.

ఇది కూడా చదవండి:

Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

Updated Date - 2023-02-28T16:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!