Nara Lokesh : మహిళ వలంటీర్‌పై వైసీపీ ఎంపీటీసీ అత్యాచారయత్నం దారుణం
ABN, First Publish Date - 2023-11-07T07:25:50+05:30
వైసీపీ నేతల దాష్టికాలకు వారి పార్టీ కార్యకర్తలైన వలంటీర్లు కూడా బలవుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ మహిళ వలంటీర్‌పై వైసీపీ ఎంపీటీసీ హత్యాయత్నంతో పాటు అత్యాచారాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు.
అమరావతి : వైసీపీ నేతల దాష్టికాలకు వారి పార్టీ కార్యకర్తలైన వలంటీర్లు కూడా బలవుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ మహిళ వలంటీర్‌పై వైసీపీ ఎంపీటీసీ హత్యాయత్నంతో పాటు అత్యాచారాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారని బాధితురాలు చెబుతోందని పేర్కొన్నారు. బాధిత వలంటీర్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే.. సామాన్య మహిళలకు జగన్ పాలనలో రక్షణ లేదని స్పష్టం అవుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు.
Updated Date - 2023-11-07T07:25:51+05:30 IST