ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌.. కోడి కత్తి వారియర్స్‌..

ABN, Publish Date - Dec 20 , 2023 | 07:28 PM

జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు.. కోడి కత్తి వారియర్స్‌... అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చమత్కరించారు. యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు.

విజయనగరం: జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు.. కోడి కత్తి వారియర్స్‌... అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చమత్కరించారు. యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే...

‘‘జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు కోడి కత్తి వారియర్స్‌. కోడికత్తి వారియర్స్‌ ఆటగాడు అవినాశ్‌రెడ్డి. బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌.. అరగంట స్టార్‌ అంబటి.. గంట స్టార్‌ అవంతి.. ఆల్‌రౌండర్‌ గోరంట్ల మాధవ్‌, రీల్‌ స్టార్‌ భరత్‌.. పించ్‌ హిట్టర్‌ బియ్యపు మాధవరెడ్డి. రాజధానిని చంపి జగన్‌ రాక్షసానందం పొందారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్‌రెడ్డి. గుంతల రోడ్డులో రోడ్డు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఇది నవశకం.. యుద్ధం మొదలైంది. చంద్రబాబు, పవన్‌ను ఒకే వేదికపై చూసి... జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుంది.

‘‘తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదు. ఇది యువగళం.. మనగళం.. ప్రజాగళం. జగన్‌ అహంకారం.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం.. పొగరు. లోకేశ్‌ది అంబేద్కర్‌ రాజ్యాంగం.. పౌరుషం. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారు. విజనరీ అంటే చంద్రబాబు.. ప్రిజనరీ అంటే జగన్‌. జగన్‌ అరెస్టుయితే రోజుకో స్కామ్‌ బయటపడేది. ప్రజాస్వామాన్ని సీఎం జగన్‌రెడ్డి దెబ్బతీశారు. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్‌ ఏంటో చూపిస్తాం. రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచిన వ్యక్తి పేదవాడు అవుతారా?. ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త పథకం తెచ్చారు. మా జీవితాలతో ఆడారని ప్రజలు చెబుతున్నారు. యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాష్ట్రంలో అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించింది’’.. అంటూ లోకేశ్ పేర్కొన్నారు.

Updated Date - Dec 20 , 2023 | 07:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising