ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: టీడీపీ, వైసీపీ జెండా వివాదం.. కర్నూలులో ఏం జరగనుందో?

ABN, First Publish Date - 2023-11-20T10:40:16+05:30

జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జెండాను తొలగించిన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జెండాను తొలగించిన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి (TDP Incharge Tikkareddy) మరికాసేపట్లో టీడీపీ జెండాను తొలగించిన చోటే జెండా ఆవిష్కరణకు వెళ్లనున్నారు. టీడీపీ జెండా దిమ్మెకు కొద్ది దూరంలో వైసీపీ జెండా దిమ్మె ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.


కాగా.. మాధవరంలో టీడీపీ జెండాను తొలగించి వైసీపీ నాయకులు తమ పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు ఆదివారం సన్నాహాలు చేస్తుండగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మాజీ జడ్పీటీసీ రాజశేఖర్‌ రెడ్డి ఆయన అల్లుళ్లు అమర్నాథ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిలు కలిసి గతంలో టీడీపీలో ఉండేవారు. అయితే రాజశేఖర్‌ రెడ్డి వైసీపీలో చేరగా ఆయన అల్లుళ్లు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. రాష్ట్రానికి ఎందుకు కావాలి జగన్‌ అనే కార్యక్రమాన్ని సోమవారం మాధవరంలో నిర్వహించడానికి వైసీపీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే రాజశేఖర్‌ రెడ్డి గతంలో తన ఆధ్వర్యంలో ఏర్పాటు టీడీపీ జెండాను తొలగించి వైసీపీ జెండా ఏర్పాటుకు ప్రయత్నిస్తుండగా ఆయన అల్లుళ్లు అమర్నాథ్‌ రెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డి, శివరామిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, సాయి కుమార్‌రెడ్డిలు కార్యకర్తలతో వచ్చి అడ్డుకున్నారు. మామ, అల్లుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మాధవరం ఎస్‌ఐ కిరణ్‌బాబు పోలీసు సిబ్బందితో వచ్చి టీడీపీ నాయకులను జీపులో ఎక్కించుకొని మంత్రాలయం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి తన కార్యకర్తలతో మంత్రా లయం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి తమ కార్యకర్త లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-11-20T13:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising