ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సీపీఐ ‘చలో విజయవాడ’ భగ్నానికి పోలీసుల యత్నం...రామకృష్ణ ఫైర్

ABN, First Publish Date - 2023-03-02T10:17:55+05:30

జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల లబ్దిదారులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు ఛలో విజయవాడకు సీపీఐ పిలుపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల (Tidco houses) లబ్దిదారులపై ప్రభుత్వ (AP government) నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు ‘‘చలో విజయవాడ’’కు సీపీఐ (CPI) పిలుపునిచ్చింది. ధర్నా చౌక్‌లో మహాధర్నా‌ చేపడుతున్నట్లు సీపీఐ ప్రకటించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు (AP Police) చలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నారు. విజయవాడ (Vijayawada) రాకుండా వివిధ జిల్లాల్లో సీపీఐ నేతల (CPI Leaders)ను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ‌నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. అయితే పోలీసులు, ప్రభుత్వ చర్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI State Secretary Ramakrishna)తీవ్రంగా ఖండించారు. టిడ్కో ఇళ్లు అప్పగించాలని, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అటు గుంటూరు జిల్లా (Guntur District)లో సీపీఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు (Muppalla Nageshwar rao), జంగాల అజయ్‌ (Jangala Ajay)లను పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. విజయవాడలో టిడ్కో ఇళ్ల కోసం సీపీఐ ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో అక్కడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు పట్ల సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-02T10:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!