ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NTR: ఎన్టీఆర్ శతజయంతి.. టీడీపీ సంచలన నిర్ణయాలు

ABN, First Publish Date - 2023-03-28T16:15:44+05:30

ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకుంది.

అమరావతి: ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోని భిన్నంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే ఆర్ధిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా మ్యానిఫెస్టో రూప కల్పన చేయాలని నిర్ణయం తీసుకుంది. మహానాడు మే లో రెండు రోజుల పాటు రాజమండ్రిలో నిర్వహించాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించింది. ఏప్రిల్ ఆఖరి వరకూ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూప కల్పన రూపొందించారు. అలాగే నవంబర్‌లో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పోలిట్ బ్యూరో భావించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్, లీడర్‌లకు దిశానిర్దేశం చేసింది. అలాగే పార్టీ సభ్యత్వంలో జీవితకాల (లైఫ్‌ టైమ్) మెంబర్‌షిప్‌ను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు 5 వేల రూపాయలు రుసుముగా పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల విజయంపై విశ్లేషణ చేసింది. మూడు స్థానాల్లో టీడీపీ గెలవడంపై నేతలు విశ్లేషించినట్లు తెలిసింది. వైసీపీ (YCP) ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు ప్రభావితం కాలేదని పోలిట్ బ్యూరో భావిస్తోంది. అధినేత నుంచి కార్యకర్త వరకూ ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా పోలిట్ బ్యూరోలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

Updated Date - 2023-03-28T16:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising