ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhaskar Reddy: సీబీఐ గెస్ట్ హౌస్ నుంచి వెళ్లిపోయిన భాస్కర్ రెడ్డి..

ABN, First Publish Date - 2023-03-12T11:39:46+05:30

వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణలో సీబీఐ (CBI) దూకుడు పెంచింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కడప: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణలో సీబీఐ (CBI) దూకుడు పెంచింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (Bhaskar Reddy) నేడు సీబీఐ విచారణ జరపనుంది. అయితే.. నేడు ఆదివారం విచారణకు వచ్చిన భాస్కర్ రెడ్డి సీబీఐ గెస్ట్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు లేకపోవడంతో భాస్కర్‌రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. సీబీఐ గెస్ట్ వచ్చిన భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ సీబీఐ అధికారులు లేరు. మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు వస్తా. వైఎస్‌ వివేకా లేఖ చూస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కేసును పక్కదారి పట్టించొద్దు. నన్ను అరెస్ట్‌ చేస్తే చేసుకోండి.. దేనికైనా సిద్ధమే అంటూ’’ సీబీఐ విచారణ కేంద్రం నుండి భాస్కర్ రెడ్డి వెళ్లిపోయారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో మూడు సార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. ఇక ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారణకు పిలవడం కీలక పరిమాణం చోటు చేసుకుంది.

భాస్కర్ రెడ్డి సెంట్రల్‌ జైలుకి రావడంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. జైలు దగ్గరకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. భాస్కర్‌రెడ్డితో పాటు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఎటుంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా సెంట్రల్‌ జైలు వద్ద భారీగా మోహరించారు.

Updated Date - 2023-03-12T11:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising