Vemuri Anand Surya: జగన్‌రెడ్డి మరోసారి ఊసాలు లెక్కపెట్టడం ఖాయం
ABN, First Publish Date - 2023-09-29T19:03:46+05:30
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్‌రెడ్డి చేసిన అవినీతిపై కటకటాలపాలు చేయడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య(Vemuri Anand Surya) వ్యాఖ్యానించారు.
అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్‌రెడ్డి చేసిన అవినీతిపై కటకటాలపాలు చేయడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య(Vemuri Anand Surya) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రతిపక్షనేతపై పెట్టింది అక్రమ కేసు కాబట్టే... ఈ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి అధికారుల జోలికి వెళ్లడం లేదు. చంద్రబాబు అవినీతి చేశాడని మంత్రులు.. వైసీపీ నేతలు, ఆ పార్టీ పేటీఎమ్ బ్యాచ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అధినేత తప్పు చేశాడని ఆధారాలు, సాక్ష్యాలు ఏమున్నాయో నిరూపించాలి. చంద్రబాబు తప్పు చేయలేదనడానికి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు.. దీక్షలు.... ధర్నాలే నిదర్శనం. యువత భవితకు వెలుగుదివ్వెలా నిలిచిన గొప్ప ప్రాజెక్ట్‌ను జగన్‌రెడ్డి దురహంకారంతో నీరుగార్చారు. జగన్‌రెడ్డి యువత జీవితాలను అంధకారం చేశాడు’’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-29T19:03:46+05:30 IST