Pattipati Pullarao: ఆ పేరెత్తే అర్హత సీఎం జగన్‌కు లేదు
ABN, First Publish Date - 2023-07-08T17:32:31+05:30
రైతు దినోత్సవం పేరు ఎత్తే అర్హత, హక్కు ఈ ముఖ్యమంత్రికి లేవు. రైతులకందించే సాయం మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా అమలు చేయని అసమర్థుడు జగన్. రైతులకు అందాల్సిన పంటల బీమా సొమ్ముని తన పార్టీ ఎమ్మెల్యేలకు దోచిపెట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ.14 లక్షల పంటల బీమా సొమ్ముకాజేశారు
అమరావతి: జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు (Pattipati Pullarao) విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతు దినోత్సవం పేరు ఎత్తే అర్హత, హక్కు ఈ ముఖ్యమంత్రికి లేవు. రైతులకందించే సాయం మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా అమలు చేయని అసమర్థుడు జగన్. రైతులకు అందాల్సిన పంటల బీమా సొమ్ముని తన పార్టీ ఎమ్మెల్యేలకు దోచిపెట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ.14 లక్షల పంటల బీమా సొమ్ముకాజేశారు. పంటల బీమా, గిట్టుబాటు ధర అందిన రైతుల జాబితాను ఎందుకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించడంలేదు?, రూ.3 వేల కోట్ల ధరలస్థిరీకరణ నిధి ఏమైందో ముఖ్యమంత్రి (CM Jagan) చెప్పాలి. రాష్ట్రంలో 92.5 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి. ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పుంది. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో.. 4 ఏళ్లలో రాష్ట్రంలో 3 వేల మంది అన్నదాతలు చనిపోయారు. పత్రికా ప్రకటనల్లో తప్ప.. జగన్ రెడ్డి రైతులకు అందిస్తున్నసాయం క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. పంటల బీమా సొమ్ము రైతులకు ఎగ్గొట్టడానికే జగన్.. వాతావరణ ఆధారిత, దిగుబడి ఆధారిత పంటల బీమా అని మెలికపెట్టారు. 9 జిల్లాల్లో వాతావరణ ఆధారిత బీమా కింద ఒక్కరైతుకి రూపాయి అందలేదు. 21 జిల్లాల్లో దిగుబడి ఆధారిత బీమా కింద అన్నదాతలకు ఇచ్చింది అరకొరే. ఈ క్రాప్‌లో తప్పుడు వివరాలు నమోదు చేసి, వైసీపీ కార్యకర్తలే రైతుల సొమ్ముని దిగమింగారు.’’ అని పుల్లారావు ఆరోపించారు.
Updated Date - 2023-07-08T17:32:31+05:30 IST