ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kannababu: మానసికస్థితి సరిగా లేదని సర్టిఫికెట్ ఉన్న ఒకే ఒక్క నేత బాలకృష్ణ

ABN, First Publish Date - 2023-09-22T12:59:41+05:30

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ జరిగిన అవకతవకలు, అవినీతి నిరూపణకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఏపీ అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై (MLA Nandamuri Balakrishna) మాజీ మంత్రి కన్నబాబు (Former Minister Kannababu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ జరిగిన అవకతవకలు, అవినీతి నిరూపణకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఏపీ అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. బాలకృష్ణ సర్టీఫైడ్ సైకో అని... మానసికస్థితి సరిగా లేదని సర్టిఫికెట్ ఉన్న ఒకే ఒక్కర నేత బాలకృష్ణ అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన జడ్జిని కూడా టీడీపీ వాళ్లు ట్రోల్ చేశారని మండిపడ్డారు. ఈ ఆర్డర్ చూస్తే అంతా చంద్రబాబే చేసినట్టు అర్ధం అవుతోందన్నారు. షెల్ కంపెనీల్లో 1, 2 లేయర్లు తెలిశాయని.. మిగిలిన లేయర్లు తెలియాలని చెప్పారు. పాత్రదారుల్ని అరెస్టు చేస్తే సూత్రదారులను అరెస్టు చెయ్యొద్దా అని ప్రశ్నించారు. రీల్ ఒకళ్లు, రియల్ ఒకళ్లు ఇద్దరు వకీళ్లు చంద్రబాబు అరెస్టు అక్రమం అంటున్నారని విమర్శించారు. ఖైదీలకు వర్కు ఫ్రంహోం ఎలా అడుగుతారని నిలదీశారు. అయిదేళ్లకు ఒక సారి మానసికస్థితిపై సర్టిఫికెట్ తీసుకోవాలంటున్నారని.. తాము అదే కోరుకుంటున్నామని కన్నబాబు విరుచుకుపడ్డారు.


2019లోనే లోపలేసేవాళ్లం.. కానీ...

కన్నబాబు ఇంకా మాట్లాడుతూ.. ఒక ఒప్పందం చేసుకున్నప్పడు నిధులు రీలీజ్ చేయడానికి ఓ విధానం ఉంటుందని.. అదేం లేకుండా పరుగులు పెట్టి డబ్బులు రిలీజ్ చేయించారని అన్నారు. ‘‘పివి రమేష్ ఫైనాన్స్ సెక్రటరీగా ఒక నోట్ రాశారు. సునీత అనే ఐఏఎస్ అధికారి రాశారు... అసులు ఫైలు ఫైనాన్స్‌కు రాలేదు... ముందు పైలెట్ ప్రాజెక్టు నిర్వహిచండి అని అడిగారు. ఇది రాజకీయ కక్ష సాధింపు జగన్ కావాలనే కేసులు పెడుతున్నారు అంటున్నారు. 2018లో జీఎస్టీ వాళ్లకు క్లారిటీ వచ్చింది... డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లింపు జరిగింది అని రెడ్ ప్లాగ్ చేశారు. దీనిపై తీసుకున్న యాక్షన్ సెక్రటేరియట్‌లో ఉన్న నోట్ ఫైల్ మాయం చేశారు. క్యాబినెట్‌ను చంద్రబాబు మోసం చేశారు... క్యాబినెట్‌లో చెప్పింది ఒకటి ఎంవోయూలో ఉన్నది ఒకటి. ఎంవోయూ చేసినప్పుడు కరెంటు పోయింది అంటున్నారు... దీన్నే చీకటి ఒప్పందం అంటారు. ఈ ఎంవోయూ ఫేక్... సీమెన్స్ కంపెనీ దర్యప్తు జరగుతున్నప్పుడు సీఐడీకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రాదన్నారు. మాకు కక్షసాధించాలని ఉంటే 2019లోనే లోపలేయ్యాలి. చంద్రబాబుకు కోర్టుల ద్వారా అన్ని దర్యాప్తులను అడ్డుకునే వారు. ఇప్పటి వరకూ ఈ కేసులు 10 మందిని అరెస్టు చేస్తే వారిలో 7గురిని యాంటిసిపేటరీ బెయిల్ లభించింది. 164 సెక్షన్ ప్రకారం పివి రమేష్, సునీత వంటి ఐఏఎస్‌లు మెజిస్టేట్ ముందు వాగ్మూలం ఇచ్చారు.ఇన్ కం ట్యాక్స్ 2024, ఆగష్టు 4న చంద్రబాబుకు నోటీసు ఇచ్చారు. వీరు ఓ విధానం తీసుకున్నారు. ఎలా ఆ డబ్బును తరలిస్తారో చెప్పారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను విచారించారు.. ఈ సందర్భంలో యోగేష్ గుప్త అనే వ్యక్తి తెరమీదకు వచ్చారు... ఈయన బోగస్ ఇన్వాయిస్‌లు క్రియేట్ చేసారు. లోకేష్‌కు కిలారి రాజేష్ సన్నిహితుడు వీరందరికి ఇనకమ్ టాక్స్ నోటీసులు ఇచ్చింది. యోగేష్ గుప్తాను ఈడీ అరెస్టు చేసింది. వీరందరికి సీఐడీ నోటీసులు ఇచ్చారు... ఆయన పెండ్యాల శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు. పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగే కాదని లోకేష్ అన్నారు. వీరిని అమెరికా టికెట్ ఇచ్చి పంపించినట్టు ప్రభుత్వం వద్ద ఆదారాలు ఉన్నాయి. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు. ఇంత పెద్ద ప్రజెక్టు పెట్టినప్పుడు జీవో వచ్చిన రోజే ఎంవోయూ ఎందుకు చేస్తారు. గుజరాత్‌కు ఏపీకి మధ్య తేడా తీస్తున్నాం. గుజరాత్‌లో 17 కోట్లు 5 సెంటర్ల పెట్టారు. గుజరాత్‌లో చేసింది ఏంటి ఏపీలో చేసింది ఏంటి క్లియర్‌గా ఉంది. 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఆ కంపేనీల నుండి రాబట్టలేరు’’ అని చెప్పుకొచ్చారు.


అది ఫేక్ ఉద్యమం...

చంద్రబాబు కోసం జరగుతుంది ఒక ఫేక్ ఉద్యమం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు జైలులో దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. బాలకృష్ణ మాట్లాడేది అర్ధం కాదన్నారు. టీడీపీ వాళ్లకు తెలుసు స్కిల్ స్కామ్‌లో, అమరావతి స్కాలంలో, ఫైబర్ నెటట్ అక్రమాలు జరిగాయని అన్నారు. 2014-19 మధ్య జరిగిన స్కాంపై ఇంకా విచారణ చెయ్యాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-22T12:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising