ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ చర్చలు

ABN, Publish Date - Dec 23 , 2023 | 06:15 PM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. చంద్రబాబుతో మూడు గంటలు పాటు ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారు.

అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. చంద్రబాబుతో మూడు గంటలు పాటు ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారు. చర్చల అనంతరం లోకేష్‌తో పాటు గన్నవరం విమానాశ్రయానికి ప్రశాంత్ కిషోర్ బయలుదేరిన వెళ్లారు. ప్రశాంత్ కిశోర్‌తో చంద్రబాబు జరిపిన చర్చలపై రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది.

ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో రాబిన్ శర్మ టీమ్ ఉంది. చర్చల్లో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తిగా పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు, పీకే భేటీ సీఎం జగన్‌ (CM JAGAN ) కి బిగ్ షాక్ అనే చెప్పాలి. చంద్రబాబు, పీకే కలిస్తే రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ పార్టీకి గడ్డుకాలమేనని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ (YCP) గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వైసీపీ పార్టీకి ప్రశాంత్ కిషోర్‌ మద్దతుగా ఉంటున్న విషయం తెలిసిందే.

Updated Date - Dec 23 , 2023 | 06:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising