ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Police: నిన్న అడ్డంకులు.. నేడు కేసులు... చంద్రబాబుపై ప్రభుత్వ కక్ష సాధింపులు

ABN, First Publish Date - 2023-02-18T13:14:44+05:30

నిన్నటి అనపర్తి సభకు సంబంధించిన ఘటనపై ప్రభుత్వం ఇంకా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: నిన్నటి అనపర్తి సభ (Anparthy Sabha)కు సంబంధించిన ఘటనపై ప్రభుత్వం ఇంకా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. బలభద్రపురం నుంచి అనపర్తి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర (TDP Chief Chandrababu Naidu Padayatra)పై పోలీసులు కేసులు నమోదు చేశారు. హింసను ప్రోత్సహించారని.. పోలీసులపై తిరగబడ్డారంటూ అక్రమ కేసులు నమోదు (Registration of illegal cases)చేశారు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief), మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Former MLA Ramakrishna Reddy)తో పాటు మరికొందరిపై కేసులు నమోదు అయ్యాయి. అదే స్టేషన్‌లో మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar), మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అదర్స్ అంటూ ఇంకొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్ (Bikkavolu Police Station) పరిధిలో మరో ఆరుగురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఫోటోలు, వీడియోలు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ (FIR)లో టీడీపీ ముఖ్య నేతల పేర్లను అనపర్తి, బిక్కవోలు పోలీసులు చేర్చుతున్నారు. బిక్కవోలులో చంద్రబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో పాటు మరో పది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

చంద్రబాబు (TDP)రోడ్ షో, బహిరంగ సభలకు అనుమతిలేకున్నా నిర్వహించటంపైన కేసులు నమోదు అయ్యాయి. నిన్న తూర్పుగోదావరి (East Godavari) జిల్లా అనపర్తిలో బహిరంగ సభలకు పోలీసులు ముందు అనుమతి ఇచ్చి ఆ తరువాత నిరాకరించిన విషయం తెలిసిందే. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకోవడంతో బలభద్రపురం నుంచి అనపర్తి వరకు ఏడు కిలోమీటర్ల మేర చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లారు. మధ్యలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీలు చేశారు. చివరకు అనపర్తి దేవిచౌక్‌లో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సంఘటనలపై అనపర్తిలో రెండు, బిక్కవోలులో ఒక కేసును పోలీసులు నమోదు చేశారు.

అనేక అడ్డంకుల నడుమ పర్యటన....

కాగా... తూర్పుగోదావరి జిల్లా (East Godavari)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పర్యటనకు పోలీసులు అనేక ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి జిల్లాలో ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో గురువారం మూడో రోజు అనపర్తి (Anaparthy)లో భారీ బహిరంగ సభకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ముందుగానే జిల్లా కలెక్టర్, ఎస్పీ వద్ద అనుమతులు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీసుకున్నారు. అయితే సభ జరగడానికి కొన్ని గంటల ముందు సభకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు అందించారు. పోలీసుల తీరుపై టీడీపీ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ... అనపర్తిలో సభ నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. దీంతో బలభద్రపురంలో పోలీసులు భారీగా మోహరించారు.

చంద్రబాబు కాన్వాయ్ అక్కడకు చేరగానే పోలీసులే స్వయంగా రోడ్డుకు అడ్డంగా వాహనాలు ఉంచి బైఠాయించారు. వాహనాలు తీయాలని చంద్రబాబు కోరినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో.. చంద్రబాబు కారు దిగి కాలినడకన అనపర్తికి బయలుదేరారు. అయితే రోడ్లపై లారీలు, బస్సులు, వ్యాన్లను నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసుల (AP Police)పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. చివరకు ఎన్నో అడ్డంకులను దాటుకుని రాత్రి 8 గంటలకు అనపర్తి చేరుకున్న చంద్రబాబు ప్రచారరథం లేకపోవడం, కరెంటు కూడా నిలిపివేయడంతో సెల్‌ఫోన్ లైట్ల (Cellphone lights) మధ్య ప్రసంగించారు.

Updated Date - 2023-02-18T13:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising