ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narayana: ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా..పశువులా?

ABN, First Publish Date - 2023-03-20T12:57:08+05:30

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(Andhra Pradesh Assembly) అరాచకానికి నిలయంగా మారింది సీపీఐ జాతీయ కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి/ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(Andhra Pradesh Assembly) అరాచకానికి నిలయంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI National Secretary Narayana) ధ్వజమెత్తారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా? పశువులా?.. బుచ్చయ్య చౌదరి(Buchaiah Chaudhary) వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉంది. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారు. అయినా సరే ఓడిపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. అందుకే అసెంబ్లీలో(assembly) ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ(TDP) ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా?..స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉంది. స్పీకర్ (Speaker), సీఎం జగన్ (CM Jagan) ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అధికారం, సీఎం పదవి శాశ్వతం కాదు. రేపు నువ్వు అటు వైపు ఉంటావు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని, బాధితులను సస్పెండ్ చేయడం తగదు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’’ అని నారాయణ అన్నారు.

Updated Date - 2023-03-20T13:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising