ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై సర్వత్రా ఆసక్తి

ABN, Publish Date - Dec 23 , 2023 | 07:57 PM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో రెండు సార్లు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ముందు, అరెస్ట్ తరువాత కూడా హైదరాబాద్‌లో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు.

టీడీపీ తరపున ఎన్నికల వూహ్యకర్తగా పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపారు. ఢిల్లీలో లోకేష్‌తో కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఈ రోజు చంద్రబాబు, లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరో సారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ - జన సేన ప్రభుత్వం ఏర్పడుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పీకే టీమ్ చంద్రబాబుతో భేటీపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

"చంద్రబాబు సీనియర్ నేత కావడంతోనే కలిశా. ఎప్పటి నుంచో చంద్రబాబును కలవాలని అనుకుంటున్నా. మళ్ళీ కూడా చంద్రబాబును కలుస్తా." అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.

కృష్ణాజిల్లా, గన్నవరం: ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అనంతరం రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.

Updated Date - Dec 23 , 2023 | 08:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising