Srinivasulu Reddy: బీటెక్ రవిని అరెస్టు చేయడం దుర్మార్గం
ABN, First Publish Date - 2023-11-14T23:30:13+05:30
10 నెలల కిందట జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పుడు బీటెక్ రవిని అరెస్టు చేయడం దుర్మార్గం. చిన్న విషయానికి పోలీసులు ఇంత రాద్దాంతం చేయడం మంచిది కాదు.
కడప: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
"10 నెలల కిందట జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పుడు బీటెక్ రవిని అరెస్టు చేయడం దుర్మార్గం. చిన్న విషయానికి పోలీసులు ఇంత రాద్దాంతం చేయడం మంచిది కాదు. పోలీసులు 10 నెలల పాటు ఏం చేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్నందునే పులివెందులలో తమ పార్టీ నేతలు ఉండకూడదని అరెస్టు చేస్తున్నారు. నిన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ రోజు పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. బీటెక్ రవిపై నాన్ బైయిలబుల్ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటారు. భయపడే ప్రసక్తే లేదు." అని శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
Updated Date - 2023-11-14T23:30:26+05:30 IST