by-election results: ఏపీ పంచాయతీ ఉపఎన్నికల ఫలితాలు.. మహేష్‌బాబు సొంతూరు బుర్రిపాలెంలో ఏ పార్టీ గెలిచిందంటే..
ABN, First Publish Date - 2023-08-19T18:31:21+05:30
ఏపీ పంచాయతీ ఉపఎన్నికల ఫలితాలు (AP Panchayat by-election results) వచ్చేశాయ్.
అమరావతి: ఏపీ పంచాయతీ ఉపఎన్నికల ఫలితాలు (AP Panchayat by-election results) వచ్చేశాయ్. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి (YCP) టీడీపీ (TDP) షాక్ ఇచ్చింది. పంచాయతీ ఉపఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. ఏపీలో చాలా చోట్లా టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో భారీ మెజార్టీతో టీడీపీ సర్పంచ్ గెలుపొందారు. గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో అధిక సంఖ్యలో టీడీపీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు విజయం సాధించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. సింగరాయకొండ మండలం పాకలలో టీడీపీ మద్దతు అభ్యర్థి సైకం చంద్రశేఖర్ సర్పంచ్‌గా విజయం సాధించారు. కొత్తపట్నం మండలం అల్లూరులో నాలుగో వార్డు, సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పదో వార్డు, కనిగిరి మండలం గురవాజీపేట 2వ వార్డు, పిసిపల్లి మండలం గుంటుపల్లి 3వ వార్డు, సీఎస్.పురం మండలం చెన్నపునాయునిపల్లి 6వ వార్డు, చీమకుర్తి మండలం మంచికలపాడు 1వ వార్డు, లింగసముద్రం మండలం చినపవని 2వ వార్డు, ఉలవపాడు మండలం ఆత్మకూరులో 5వ వార్డు, టంగుటూరు మండలం పొందూరు 1వ వార్డుల్లో టీడీపీ మద్దతు అభ్యర్ధులు గెలుపొందారు.
Updated Date - 2023-08-19T18:40:03+05:30 IST