ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parital Sriram: ఇక నుంచి ఆట మొదలవుతుంది.. అంతా చూడండి

ABN, First Publish Date - 2023-10-31T13:18:56+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) బెయిల్ రావడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత (Former Minister Paritala Sunita) ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) ఆధ్వర్యంలో నాయకులు బాణాసంచా కాల్చి ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులకు (YCP Leaders) అసలు సినిమా ఇప్పుడు ప్రారంభమైందన్నారు. ఇన్ని రోజులు ఇష్టానుసారం మాట్లాడిన నాయకులు ఇక జాగ్రత్త అంటూ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి జనంలోకి వచ్చారంటే వైసీపీ పతనం ప్రారంభమైనట్టే అని అన్నారు. 50 రోజులకు పైగా ప్రతి వ్యక్తి చంద్రబాబు ఎప్పుడు బయటికి వస్తారు అన్నట్లు ఆశగా ఎదురు చూశారన్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ఒక వ్యక్తి కోసం ఇంతగా పరితపించిన సందర్భాలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన ప్రజల గుండెల్లో ఎంత ప్రజలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారో ఇప్పుడు అర్థమవుతోందని తెలిపారు. ఇక నుంచి ఆట మొదలవుతుంది.. అంతా చూడండి అంటూ పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-31T13:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising