Paritala Sreeram: జగన్‌ను దించేందుకు అన్ని పార్టీలు ఏకంకావాలి
ABN, First Publish Date - 2023-09-14T16:29:27+05:30
టీడీపీతో (TDP) పొత్తు పెట్టుకున్నందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగన్‌ను గద్దె దింపేందుకు అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేయాలి. టీడీపీ నేతలు పార్టీలో పదవులు
అనంతపురం: సీఎం జగన్‌ను (Cm jagan) గద్దెదించడమే అన్ని పార్టీల ముఖ్య ఉద్దేశ్యమని ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ (Paritala Sreeram) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీడీపీతో (TDP) పొత్తు పెట్టుకున్నందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగన్‌ను గద్దె దింపేందుకు అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేయాలి. టీడీపీ నేతలు పార్టీలో పదవులు గురించి ఆలోచన చేయకూడదు. చంద్రబాబును (Chandrababu) ముఖ్యమంత్రిని చేయడం పైనే దృష్టి సారించాలి. ప్రతిపక్ష నేతను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటున్నాయి. జగన్‌ను దింపడం కోసం కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. జగన్ అనేవాడు క్యాన్సర్ లాగా పెరిగి ఈ రాష్ట్రాన్ని కూలదోస్తాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఏకం కావాలి.’’ అని పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు.
Updated Date - 2023-09-14T16:29:27+05:30 IST