ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viveka Murder Case : వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-08-04T19:48:32+05:30

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది...

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి (Siva Shankar Reddy) బెయిల్ దాఖలుకు సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతిచ్చింది. శుక్రవారం నాడు సుప్రీంలో ఈ పరిణామం జరిగింది. ట్రయిల్ కోర్టులో (Trail Court) బెయిల్ దాఖలుకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. సెప్టెంబర్ వరకు విచారణ ప్రారంభం కాకపోతే బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చంటూ గతంలో జస్టిస్ ఎంఆర్ షా (Justice MR Shah) నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల శివశంకర్ రెడ్డి సుప్రీంలో సవాలు చేశారు. ఇవాళ జస్టిస్ విక్రమనాథ్ (Justice Vikramnath) నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గతంలో షా ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చింది. బెయిల్ కోసం జస్టిస్ షా ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అడ్డురావని ధర్మాసనం తెలిపింది. భాగస్వామ్య పక్షాల అందరి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా బెయిల్‌పై నిర్ణయం తీసుకోవచ్చని ట్రయిల్ కోర్టుకు సుప్రీం సూచించింది.


కోర్టుకు రండి..!

ఇదిలా ఉంటే.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది. ఆగస్టు-14న కోర్టుకు హాజరుకావాలని సమన్లలో (Summons) కోర్టు పేర్కొంది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్‌ రెడ్డిపై (Uday Bhaskar Reddy) సీబీఐ ఛార్జిషీట్ (CBI Chargesheet) వేసింది. కాగా.. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న వివేకా హత్య కేసులో ఒక్కసారిగా సీబీఐ కోర్టు నుంచి పిలుపురావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన్ను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. అయితే.. ఇప్పటి వరకూ సీబీఐ విచారణకు మాత్రమే పిలిచింది.. ఇప్పుడు కోర్టు సమన్లు ఇవ్వడంతో ఆగస్టు-14న ఏం జరుగుతుందో అని వైసీపీ వర్గాల్లో గుబులు మొదలైందట.


ఇవి కూడా చదవండి


AP Politics : ఏపీలో అసలేం జరుగుతోంది.. చంద్రబాబు, లోకేష్‌ల సెక్యూరిటీపై కేంద్రం ఆరా..!


Chandrababu: రణరంగంగా మారిన అంగళ్లు.. రాళ్ల దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులు.. తీవ్రస్థాయిలో హెచ్చరించిన టీడీపీ అధినేత


Political BRO : ‘ బ్రో’ సినిమా వివాదంపై మొదటిసారి స్పందించిన పవన్ కల్యాణ్..



Updated Date - 2023-08-04T19:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising