AP Politics : ఏపీలో అసలేం జరుగుతోంది.. చంద్రబాబు, లోకేష్‌ల సెక్యూరిటీపై కేంద్రం ఆరా..!

ABN , First Publish Date - 2023-08-04T18:28:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) శాంతి భద్రతలు క్షీణించాయి..! పోలీసులు వైసీపీకే (YSR Congress) వత్తాసు పలుకుతున్నారు..! వైసీపీ కార్యకర్తలు, నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది..!

AP Politics : ఏపీలో అసలేం జరుగుతోంది.. చంద్రబాబు, లోకేష్‌ల సెక్యూరిటీపై కేంద్రం ఆరా..!

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) శాంతి భద్రతలు క్షీణించాయి..! పోలీసులు వైసీపీకే (YSR Congress) వత్తాసు పలుకుతున్నారు..! వైసీపీ కార్యకర్తలు, నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది..! ఇవీ గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్‌పై విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు. ఓ వైపు యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం పాదయాత్ర’ పాదయాత్ర విజయవంతంగా సాగుతుండటం, మరోవైపు.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన, ప్రాజెక్టుల సందర్శనతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండటంతో.. ఆయన వెంట నడుస్తున్న జనాధరణను చూసి వైసీపీకి ఒళ్లు మండినంత పనవుతోంది.! దీంతో అటు పాదయాత్రకు, ఇటు చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. బాబు ఎక్కడ పర్యటించినా వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నా ఇటీవల దాడులు జరిగాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. దీనిపై శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ స్పందించింది.


Central-home-affairs.jpg

కేంద్రం సీరియస్..!

అసలు ఆంధ్రాలో ఏం జరుగుతోంది..? ఎందుకిన్ని గొడవలు..? ఇంత భద్రత ఉన్నా నారా చంద్రబాబు, లోకేష్‌‌లకు ఎందుకిలా జరుగుతోంది..? అని గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేంద్రం సీరియస్ అయ్యింది. చంద్రబాబు, లోకేశ్‌ల సెక్యూరిటీపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. బాబు, లోకేశ్‌లకు కల్పించిన భద్రతపై కేంద్ర హోం శాఖ నివేదిక కోరింది. ఈ మేరకు ఏపీ సీఎస్, డీజీపీలకు హోంశాఖ లేఖ రాసింది. మరీ ముఖ్యంగా.. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడులపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీంతోపాటు లోకేశ్ యువగళం పాదయాత్రకు కల్పించిన భద్రత వివరాలను కూడా కేంద్ర హోంశాఖ కోరింది. అదేవిధంగా.. గత నవంబర్-04న నందిగామలో చంద్రబాబు ర్యాలీలో జరిగిన రాళ్ల దాడిపై కూడా హోంశాఖ నివేదిక ఇవ్వాలని కోరింది. ఏమాత్రం జాప్యం చేయకుండా.. చంద్రబాబు, లోకేశ్‌లకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌లను హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తం అన్ని విషయాలపై జూలై- 27న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఇంతవరకూ కేంద్రానికి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

CBN-And-Lokesh.jpg

కనకమేడల లేఖ!

గత కొన్నినెలలుగా చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనల్లో దాడులు జరుగుతున్నాయని.. ఇద్దరికీ సరైన భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కేంద్రానికి టీడీపీ ఎంపీ కనకమేడల.. కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ లేఖపై.. పై విధంగా కేంద్ర హోంశాఖ స్పందించింది. ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులపైనా కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌లను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అయితే ఇంతవరకూ ఏపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Fight-Between-YSRCP-And-TDP.jpg


ఇవి కూడా చదవండి


Chandrababu: రణరంగంగా మారిన అంగళ్లు.. రాళ్ల దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులు.. తీవ్రస్థాయిలో హెచ్చరించిన టీడీపీ అధినేత


Political BRO : ‘ బ్రో’ సినిమా వివాదంపై మొదటిసారి స్పందించిన పవన్ కల్యాణ్..



Updated Date - 2023-08-04T18:35:19+05:30 IST