ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sports Minister: జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్‌పై క్రీడాశాఖ మంత్రి లైంగిక వేధింపులు

ABN, First Publish Date - 2022-12-31T08:27:40+05:30

ఓ జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్‌పై సాక్షాత్తూ క్రీడాశాఖ మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన...

Sports Minister Sandeep Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ : ఓ జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్‌పై సాక్షాత్తూ క్రీడాశాఖ మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హర్యానా రాష్ట్రంలో సంచలనం రేపింది.(Junior Athletics Coach) తనను లైంగికంగా వేధించాడంటూ హర్యానా(Haryana) క్రీడా శాఖమంత్రి సందీప్ సింగ్‌పై(Sports Minister Sandeep Singh) జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డి) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా కోచ్ మంత్రిపై ఈ ఆరోపణ చేశారు.

అయితే మహిళా కోచ్ చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. తనను క్రీడాశాఖ మంత్రి మొదట జిమ్‌లో చూశాడని, అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మెసేజ్ చేశాడని, కలవాలని మంత్రి పదే పదే పట్టుబట్టాడని అథ్లెటిక్స్ కోచ్ ఆరోపించారు.

తనకు రావాల్సిన నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ పెండింగ్‌లో ఉంచాడని, అందుకే తాను మంత్రిని అతని క్యాంప్ కార్యాలయంలో కలిశానని మహిళా కోచ్ చెప్పారు.మంత్రి తనపై లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని కోచ్ ఆరోపించింది.మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం వెంటనే క్రీడాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్‌ఎల్‌డి డిమాండ్ చేసింది.

Updated Date - 2022-12-31T09:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising