Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (19/01/2026)

ABN , First Publish Date - Jan 19 , 2026 | 06:37 AM

ప్రపంచవ్యాప్తంగా వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (19/01/2026)
Breaking News

Live News & Updates

  • Jan 19, 2026 21:57 IST

    మరోసారి పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు..

    • పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం..

    • పిన్నెల్లి సోదరులను మరోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..

    • మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు.

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 21:54 IST

    సంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం..

    • సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో దొంగల బీభత్సం..

    • 14 తులాల బంగారం, 12 తులాల వెండి చోరీ..

    • వరుస చోరీలతో ఆందోళనలో కాలనీవాసులు.

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 21:46 IST

    అరటిపండును ఏ టైంలో తినాలో తెలుసా..

    • అరటిపండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే..

    • అయితే వాటిని సరైన సమయంలో తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 21:13 IST

    మద్యం మత్తులో పోలీసులపై దాడి.. మందుబాబుల అరెస్ట్..

    • మచిలీపట్నంలో మద్యం మత్తులో పోలీసులపై దాడి చేసిన యువకులు..

    • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 21:06 IST

    ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. హరీష్‌రావుకు నోటీసులు..

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..

    • మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిన సిట్..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 20:21 IST

    నేతన్నలకు మరో గుడ్‌ న్యూస్‌..

    • ఏపీలో నేతన్నలకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పిన కూటమి ప్రభుత్వం..

    • 33 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 20:09 IST

    అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యం: మంత్రి దామోదర్

    • పేదలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే లక్ష్యం..

    • అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్‌ సహకారంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 19:59 IST

    వైసీపీ పాలనంతా దోపిడీనే: మంత్రి ఫరూక్

    • వైసీపీ అధినేతపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆగ్రహం..

    • 90 శాతం పిటిషన్లు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి: మంత్రి ఎన్ఎండీ ఫరూక్

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 19:52 IST

    రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

    • స్విజ్జర్లాండ్ జ్యూరిక్‌‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..

    • 2026లో డ్రోన్‌ ట్యాక్సీ, డ్రోన్‌ అంబులెన్స్‌లు తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 19:40 IST

    కరూర్ తొక్కిసలాట కేసు.. సీబీఐ అడిగిన ప్రశ్నలు ఇవేనా..

    • దాదాపు పూర్తైన తమిళ స్టార్ హీరో విజయ్ సీబీఐ విచారణ..

    • సమాధానాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సీబీఐ అధికారులు కోరినట్టు సమాచారం..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 19:31 IST

    యూపీ మాజీ సీఎం ములాయంసింగ్ కుమారుడు సంచలన పోస్ట్..

    • తన భార్య అపర్ణా యాదవ్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు ప్రతీక్ యాదవ్ పోస్ట్..

    • అపర్ణ తన కుటుంబాన్ని నాశనం చేసిందని ఆరోపించిన ప్రతీక్..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 19:18 IST

    తప్పక దర్శించాల్సిన ప్రసిద్ధ ఆలయాలు ఇవే..

    • హైదరాబాద్‌లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలు.. ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.

    • తప్పక సందర్శించాల్సిన ముఖ్యమైన ఆలయాలు ఇవే..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 19:03 IST

    సైబర్ బాధితులకు భరోసా.. పోలీసుల వినూత్న కార్యక్రమం..

    • సైబర్ నేరాల్లో బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు చర్యలు..

    • పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘సీ-మిత్ర’ ఏర్పాటు..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 18:55 IST

    కుక్కల్ని చంపడం దారుణం: రేణూ దేశాయ్

    • వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ ఆగ్రహం..

    • భూమిపై ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది..

    • మనుషుల నిర్లక్ష్యం వల్లే చాలా సమస్యలు తలెత్తుతున్నాయి: రేణూ దేశాయ్

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 18:13 IST

    ఇక శాంతి గురించి ఆలోచించను: డొనాల్డ్ ట్రంప్

    • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం..

    • ఎనిమిది యుద్ధాలు ఆపినా.. నోబెల్ బహుమతి ఇవ్వలేదని వ్యాఖ్య..

    • నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు లేఖ రాసిన ట్రంప్.

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 18:08 IST

    తాలిబన్లు రాక ముందు.. అఫ్గానిస్తాన్ ఎలా ఉండేదో తెలుసా..

    • అఫ్గానిస్థాన్ అనగానే మనకు ఉగ్రవాదులు, బీడు భూములు గుర్తొస్తాయి..

    • 1960, 70లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా గుర్తింపు..

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 17:59 IST

    బీర్లు తాగడంలో పోటీ.. ఇద్దరి మృతి..

    • తిరుపతి జిల్లా పీలేరులో యువకుల మధ్య బీర్ల పోటీ..

    • ఇద్దరు యువకులు.. ఒక్కొక్కరు 19 బీర్లు తాగిన వైనం..

    • పరిస్థితి విషమించడంతో మృతి..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 17:47 IST

    స్విట్జర్లాండ్‌లో సీఎం చంద్రబాబుతో భారత రాయబారి భేటీ

    • ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్విట్జర్లాండ్‌లో పర్యటించారు..

    • చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్‌ భేటీ..

    • స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు సహకరించాలని కోరిన మంత్రి నారా లోకేశ్

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 17:10 IST

    ప్రేమ పేరుతో మోసం.. ఎస్‌ఐకి పదేళ్ల జైలు..

    • ప్రేమ పేరుతో మోసానికి పాల్పడిన ఎస్‌ఐకి పదేళ్ల జైలు శిక్ష..

    • తీర్పు వెలువరించిన గుంటూరు జిల్లా సెషన్స్ కోర్టు.

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 16:52 IST

    బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్..

    • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్..

    • రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నితిన్ నబీన్..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 16:41 IST

    మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఖండించిన మాజీ క్రికెటర్..

    • ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఖండించిన మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్

    • అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఫిక్సింగ్ అసాధ్యం: పార్థివ్ పటేల్

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 16:32 IST

    జన్వాడ భూముల కేసులో.. కోర్టు ఆదేశాలివే..

    • జన్వాడ భూముల వ్యవహారంపై నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు..

    • ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశించింది..

    • తదుపరి విచారణకు అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించిన కోర్టు..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 16:03 IST

    ఢిల్లీ ఐటీ యువకుడి మృతి.. అసలు నిజం ఇదే..

    • సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

    • ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో నీటి కుంటలో పడి ఉద్యోగి మృతి..

    • గుండెపోటు కారణంగానే మరణించినట్లు పోలీసుల వెల్లడి..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 15:57 IST

    బిడ్డ కోసం తల్లి కోతి సాహసం.. వీడియో వైరల్..

    • కరెంట్ తీగలపై ఇరుక్కుపోయిన పిల్ల కోతి..

    • బిడ్డ కోసం తల్లి కోతి సాహసం..

    • ప్రాణాలకు తెగించి రక్షించుకున్న వైనం..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 15:36 IST

    ఉన్నావ్ అత్యాచార కేసులో హైకోర్టు కీలక తీర్పు

    • ఉన్నావ్ అత్యాచార కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది..

    • నిందితుడు కుల్‌దీప్ వేసిన పిటిషన్‌ ను తిరస్కరించిన కోర్టు..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 15:13 IST

    పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై విచారణ వాయిదా..

    • కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా..

    • ఫిబ్రవరి 20లోపు లిఖితపూర్వకమైన సబ్మిషన్ ఇవ్వాలని కోర్టు ఆదేశం..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 14:44 IST

    అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి పోస్ట్.. వ్యక్తి ఆత్మహత్య

    • బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ యువతి పోస్ట్..

    • వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వ్యక్తి..

    • అవమానం భరించలేక ఆత్మహత్య..

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 14:42 IST

    ఊడిన విమానం టైరు.. వీడియో వైరల్..

    • అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘటన..

    • విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఊడిన ముందు టైరు..

    • పైలట్ అప్రమత్తతతో తప్పిన పెద్ద ప్రమాదం.

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 14:26 IST

    అక్రమార్కులకు తప్పకుండా శిక్ష పడుతుంది: ఏపీ బీజేపీ చీఫ్

    • మూడేళ్లకు ఒక్కసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు మారుతూ ఉంటారు..

    • కార్యకర్తలను గుర్తించే పార్టీ బీజేపీ..

    • అక్రమార్కులకు తప్పకుండా శిక్ష పడుతుంది: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 14:18 IST

    ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం..

    • తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో కీలక పరిణామం..

    • స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు..

    • తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసిన కోర్ట్.

      పూర్తి కథనం..

  • Jan 19, 2026 13:43 IST

    అమ్మతనానికే మచ్చ తెచ్చిన మహిళ

    • ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన ఓ తల్లి

    • దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు

    • మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో చోటు చేసుకున్న ఘటన

      పూర్తి కథనం

  • Jan 19, 2026 13:31 IST

    సిద్దిపేట పట్టణంలో దారుణ ఘటన

    • భార్యను అతికిరాతంగా హత్య చేసిన భర్త

    • అడ్డుకోబోయిన కూతురిపై రోకలి బండతో దాడి

    • అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు

    • కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు

      పూర్తి కథనం

  • Jan 19, 2026 13:18 IST

    మహారాష్ట్ర థానే జిల్లా కల్యాణ్ ప్రాంతంలో విషాదం

    • విషాదంగా మారిన ప్రీ-వెడ్డింగ్(హల్దీ) కార్యక్రమం

    • విందులో వడ్డించిన ఆహారం తిని 125 మందికి అస్వస్థత

    • ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి, వికారం రావడంతో కలకలం

      పూర్తి కథనం

  • Jan 19, 2026 13:00 IST

    సైకిల్ తొక్కడం నేర్పుతూ ఔరా అనిపిస్తున్న చైనా యువకుడు

    • ప్రస్తుతం షాంఘాయ్ యూనివర్సిటీ ఆఫ్ స్పోర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న యువకుడు

    • తన చుట్టూ ఉండే అనేకమందికి సైకిల్ తొక్కడం రాదన్న విషయాన్ని గ్రహించిన యువకుడు

    • దీన్ని ఓ వ్యాపార అవకాశంగా మార్చుకున్న సదరు యువకుడు

    • సైకిల్ నేర్పినందుకు రూ.10 వేలు తీసుకుంటున్న యువకుడు

      పూర్తి కథనం

  • Jan 19, 2026 12:52 IST

    నేడు ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి

    • వేమన జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్

    • తన పద్యాలతో కులమత భేదాలు, మూఢ నమ్మకాలు పారద్రోలారని ప్రశంస

    • ‘విశ్వదాభిరామ వినురవేమా’ అనే నీతి సూత్రాలు ఈనాటికీ మార్గదర్శకం

    • అధికారికంగా వేమన జయంతి వేడుకల నిర్వహణ

      పూర్తి కథనం

  • Jan 19, 2026 12:24 IST

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం

    • తెలంగాణలో స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం వేగం పెంచిన కవిత

    • సంక్రాంతి పండగ వేళ హైదరాబాద్‌లో కవిత, ప్రశాంత్ కిషోర్ భేటీ

    • తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చ

      పూర్తి కథనం

  • Jan 19, 2026 12:17 IST

    మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం

    • తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కీలక నిర్ణయం

    • ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం

    • పార్లమెంట్ వారీగా ఆయా మంత్రులకు ఇన్‌ఛార్జ్‌‌ బాధ్యతలు

    • 15 నియోజకవర్గాలకు గానూ 15మంది మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు

      పూర్తి కథనం

  • Jan 19, 2026 11:36 IST

    విద్యార్థులకు గుడ్ న్యూస్

    • జనవరి 23న మాఘ శుద్ధ పంచమి సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్

    • శ్రీ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు

    • ఆ రోజు భక్తులకు సరస్వతీ దేవి రూపంలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

    • శ్రీ పంచమి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం

      పూర్తి కథనం

  • Jan 19, 2026 11:29 IST

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం

    • చంటి బిడ్డతో సహా కాశీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన వ్యక్తి

    • రైలు ఎక్కుతుండగా మెట్లపై కాలుపెట్టాక పట్టు తప్పిన పడిపోయిన వ్యక్తి

    • బోగీ డోర్ పక్కన ఉన్న రాడ్ పట్టుకుని వేలాడుతూ నిలదొక్కుకునే ప్రయత్నం

    • అతడి చేతిలోని బిడ్డను పట్టుకున్న రైల్లోని మరో ప్యాసింజర్

    • ఇదంతా గమనిస్తూ సెకెన్ల వ్యవధిలో ఆ వ్యక్తిని కాపాడిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది

      పూర్తి కథనం

  • Jan 19, 2026 10:36 IST

    బండ్ల గణేష్ సంకల్ప యాత్ర

    • సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టిన సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్

    • రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు యాత్ర ప్రారంభించిన గణేష్

    • సుమారు 460 నుంచి 500 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న గణేష్ సంకల్ప యాత్ర

    • ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే‌‌ అని తెలిపిన గణేష్

      పూర్తి కథనం

  • Jan 19, 2026 10:07 IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు

    • కాకినాడ జిల్లా చేబ్రోలు వద్ద బస్సు బోల్తా.. 9 మందికి స్వల్ప గాయాలు

    • జగ్గంపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

    • నెల్లూరు జిల్లా సీతారామపురం సమీపంలో కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు

      పూర్తి కథనం

  • Jan 19, 2026 09:48 IST

    రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • వేగంగా వచ్చి యాక్టివాపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న లారీ

    • లారీ చక్రాల కింద నలిగి వ్యక్తి అక్కడిక్కడే మృతి

      పూర్తి కథనం

  • Jan 19, 2026 09:13 IST

    ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఎంపీకి ఈడీ నోటీసులు

    • ఈనెల 23న విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు

    • ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానం

    • హవాలా, మనీలాండరింగ్ రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు అనుమానం

    • ఇప్పటికే ఇదే కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ

      పూర్తి కథనం

  • Jan 19, 2026 08:14 IST

    ఘోర ప్రమాదం

    • జార్ఖండ్: లతహార్ జిల్లా మహువాడండ్ పరిధిలో ఘోర ప్రమాదం

    • ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బోల్తాపడిన స్కూల్ బస్సు

    • ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. 85మందికి గాయాలు

    • గాయపడిన వారిని మహువాడండ్ ఆసుపత్రికి తరలింపు

    • బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సును నియంత్రించలేకపోయిన డ్రైవర్

      పూర్తి కథనం

  • Jan 19, 2026 08:11 IST

    ఘనంగా నాగోబా జాతర ప్రారంభం..

    • ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఘనంగా నాగోబా జాతర

    • ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా నాగోబా జాతర

    • ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య ప్రారంభం

    • నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు చేసిన మెస్రం వంశీయులు

    • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు

      పూర్తి కథనం

  • Jan 19, 2026 07:26 IST

    స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

    • దక్షిణ స్పెయిన్‌లోని అడమూజ్ టౌన్‌ వద్ద ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు

    • మలాగా నుంచి మ్యాడ్రిడ్‌కు వెళుతున్న రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం

    • పక్క ట్రాక్‌పై వెళుతున్న మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టిన రైలు

    • ఈ ప్రమాదంలో 21 మంది దుర్మరణం, 73 మందికి గాయాలు

      పూర్తి కథనం

  • Jan 19, 2026 07:03 IST

    చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు

    • సోమవారం ఉదయం 6.00 గంటల సమయానికి రూ.1,43,770కు చేరిన తులం బంగారం

    • కిలో రూ.3లక్షలు దాటి ప్రస్తుతం రూ.3,09,900 వద్ద కొనసాగుతున్న వెండి

    • బంగారం, వెండి కొనాలంటేనే వణికిపోతున్న కొనుగోలుదారులు

      పూర్తి కథనం

  • Jan 19, 2026 07:00 IST

    మేడారంలో క్యాబినెట్ సమావేశం..

    • వచ్చేనెలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్‌ నిర్ణయం

    • 2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు

    • మెట్రో రెండో దశ భూసేకరణకు పచ్చజెండా

    • 2,787 కోట్లు కేటాయించాలని నిర్ణయం

    • పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు హైలెవల్‌ బ్రిడ్జి

    • నిర్ణయాలను వెల్లడించిన పొంగులేటి

      పూర్తి కథనం

  • Jan 19, 2026 06:46 IST

    క్రెడిబిలిటీ ఎవరికుందో కూడా తెలుసు: సీఎం చంద్రబాబు

    • అభివృద్ధి చేయలేని వాళ్లకే క్రెడిట్‌ పాట్లు: సీఎం చంద్రబాబు

    • అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట: సీఎం చంద్రబాబు

    • 3 ప్రాంతాల్లోనూ చావుదెబ్బతిన్నారు: సీఎం చంద్రబాబు

    • పిన్నమ్మ పుస్తెలు తెంచిన నేరస్థులను రాజకీయం ముసుగులో కాపాడుతున్నారు: సీఎం చంద్రబాబు

    • ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధానా..?: సీఎం చంద్రబాబు

      పూర్తి కథనం