Share News

Vijay CBI inquiry: కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌ను సీబీఐ అడిగిన ప్రశ్నలు ఇవేనా..

ABN , Publish Date - Jan 19 , 2026 | 07:31 PM

తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సీబీఐ విచారణ తాజాగా పూర్తయింది. కరూర్ తొక్కిసలాట కేసును దర్యాఫ్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ ఢిల్లీలోని కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తోంది.

Vijay CBI inquiry: కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌ను సీబీఐ అడిగిన ప్రశ్నలు ఇవేనా..
TVK chief Vijay CBI inquiry

తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సీబీఐ విచారణ తాజాగా పూర్తయింది. కరూర్ తొక్కిసలాట కేసును దర్యాఫ్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ ఢిల్లీలోని కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన విజయ్‌ను సీబీఐ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. రెండోసారి ఈ రోజు (సోమవారం) ప్రశ్నించారు (Vijay CBI investigation).


'కరూర్ ప్రచారంలో వాహనంపై నిల్చుని మాట్లాడే సమయంలో రద్దీని గమనించాలేదా?', 'తొక్కిసలాటను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?', 'తొక్కిసలాట జరుగుతుంటే మీ వాహనాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్లారు?' వంటి ప్రశ్నలు సీబీఐ అధికారుల నుంచి విజయ్‌కు ఎదురైనట్టు సమాచారం. వీటిల్లో కొన్నింటికి జవాబులు చెప్పిన విజయ్.. మరికొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు గడువు కోరినట్టు తెలుస్తోంది (TVK chief Vijay CBI inquiry).


విచారణలో భాగంగా ఇచ్చిన సమాధానాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని విజయ్‌ని సీబీఐ అధికారులు కోరినట్టు సమాచారం (CBI probe Vijay). కాగా, కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ దాఖలు చేయనున్న అభియోగ పత్రంలో విజయ్ పేరును కూడా చేర్చబోతున్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

ఎనిమిది యుద్ధాలు ఆపినా నోబెల్ ఇవ్వలేదు.. ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్


తాలిబన్లు రాక ముందు.. అఫ్గానిస్థాన్ ఎంత ఆధునికంగా ఉండేదో తెలుసా..

Updated Date - Jan 19 , 2026 | 07:34 PM