Share News

Afghanistan 1960s photos: తాలిబన్లు రాక ముందు.. అఫ్గానిస్థాన్ ఎంత ఆధునికంగా ఉండేదో తెలుసా..

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:31 PM

అఫ్గానిస్థాన్ అనగానే మనకు ఉగ్రవాదులు, బీడు భూములు, కనీస స్వేచ్ఛ లేకుండా గడిపే మహిళలు, పేదరికం తాండవించే గ్రామాలు కళ్ల ముందు మెదులుతాయి. అఫ్గాన్‌లో జీవితం కష్టాలతో కూడినదిగా మనకు కనిపిస్తుంటుంది. అయితే అఫ్గానిస్థాన్ ఒకప్పుడు ఆధునికతకు ప్రతీకగా నిలిచిన దేశం.

Afghanistan 1960s photos: తాలిబన్లు రాక ముందు.. అఫ్గానిస్థాన్ ఎంత ఆధునికంగా ఉండేదో తెలుసా..
Afghanistan 1960s photos

అఫ్గానిస్థాన్ అనగానే మనకు ఉగ్రవాదులు, బీడు భూములు, కనీస స్వేచ్ఛ లేకుండా గడిపే మహిళలు, పేదరికం తాండవించే గ్రామాలు కళ్ల ముందు మెదులుతాయి. అఫ్గాన్‌లో జీవితం కష్టాలతో కూడినదిగా మనకు కనిపిస్తుంటుంది. అయితే అఫ్గానిస్థాన్ ఒకప్పుడు ఆధునికతకు ప్రతీకగా నిలిచిన దేశం. 1960, 70ల కాలంలో ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. నగర జీవనం, విద్యా వ్యవస్థ, మహిళల స్వేచ్ఛ, సాంస్కృతిక వైవిధ్యంతో ఆధునిక సమాజానికి ప్రతిబింబంగా ఉండేది (old Afghanistan images).


1967-68లో అఫ్గాన్ జీవన విధానాన్ని యునెస్కో కోసం పనిచేసిన అమెరికన్ విద్యావేత్త డాక్టర్ విలియం పాడ్లిచ్ అధ్యయనం చేశారు. ఫొటోలు తీసి వాటిని భద్రపరిచారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1960, 70ల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే తరగతి గదిలో చదువుతున్నట్లు ఆ ఫొటోలు చూపిస్తున్నాయి.


మహిళలు చీరలు, స్కర్టులు, మోడర్న్ దుస్తుల్లో భయం లేకుండా వీధుల్లో తిరగడం కనిపిస్తోంది. అఫ్గాన్ మహిళలు విద్య, ఉద్యోగాల్లో చురుకుగా పాల్గొనడం అప్పట్లో సాధారణ విషయంగానే ఉండేది. పాశ్చాత్య ఫ్యాషన్ ప్రభావం కూడా కనిపించేది. సంగీతం, కళలు, సాహిత్యం స్వేచ్ఛగా వికసించేవి (vintage Afghanistan photos).


అరవై ఏళ్ల క్రితమే అంతటి ఆధునికంగా ఉన్న అఫ్గానిస్థాన్‌ను సోవియట్ దండయాత్ర, అంతర్గత యుద్ధాలు, రాజకీయ అస్థిరత మొదలైనవి దశాబ్దాల పాటు వెనక్కి నెట్టేశాయి (Afghanistan before war). పలు దేశాలు అఫ్గాన్‌ను తమ రాజకీయ కారణాల కోసం వినియోగించుకున్నాయి.


శాంతి, అభివృద్ధికి దూరమై తాలబన్ల పాలనకు చిక్కింది. తాలిబన్లు 1996 నాటికి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కఠినమైన షరియా చట్టం అమల్లోకి వచ్చింది. మహిళలకు విద్య, ఉపాధి, స్వేచ్ఛ లేకుండా పోయాయి. దేశం వందేళ్లు వెనక్కి వెళ్లిపోయింది.


ఇవి కూడా చదవండి..

ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..


మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 19 , 2026 | 04:31 PM