AP BJP Chief Madhav: న్యూఢిల్లీలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:01 PM
మూడేళ్లకు ఒక్కసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు మారుతూ ఉంటారని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. కార్యకర్తలను గుర్తించే పార్టీ.. బీజేపీ అని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 19: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో అనేక సంచలనాలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. లిక్కర్ అవినీతి మాత్రమే కాదు.. గత ప్రభుత్వం అనేక అరాచకాలు చేసిందని విమర్శించారు. అక్రమార్కులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్‌పై ఏపీ చీఫ్ మాధవ్ పైవిధంగా స్పందించారు.
మాధవ్ మాట్లాడుతూ.. మూడేళ్లకు ఒక్కసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు మారుతూ ఉంటారని చెప్పారు. కార్యకర్తలను గుర్తించే పార్టీ బీజేపీ అని..ఈ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. నితిన్ నబీన్‌కు మద్దతు తెలుపుతూ ఏపీ బీజేపీ తరఫున రెండుసెట్ల నామినేషన్ పత్రాలు వేస్తున్నామన్నారు. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగనుందని తెలిపారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో తాము ఢిల్లీకి వచ్చామని మాధవ్ వివరించారు. తామంతా కలిసి నేడు నితిన్ నబీన్‌కు మద్దతు తెలుపుతూ నామినేషన్ వేస్తామన్నారు. 20 మందితో రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు.