Share News

Supreme Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. బీజేపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక పరిణామం

ABN , Publish Date - Jan 19 , 2026 | 01:37 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం న్యాయస్థానంలో విచారణ జరిగింది.

Supreme Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. బీజేపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక పరిణామం
Supreme Court

న్యూఢిల్లీ, జనవరి 19: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో(Supreme Court) కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు(Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.


సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లనూ ఈ పిటిషన్‌లో పొందుపరిచారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది.


ఇవి కూడా చదవండి...

మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులు

ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 02:04 PM